Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jammalamadugu: ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తే, ఇండిపెండెంట్‌గా భూపేష్..?

ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి కడప జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ జిల్లా నుంచే ఇద్దరు ముఖ్యమంత్రులుగా వచ్చారు. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం చాలా ప్రత్యేకం. ఒకప్పుడు ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ముద్ర పడ్డ జమ్మలమడుగు.. ఆ తర్వాత కాలంలో అభివృద్ధి వైపు అడుగులేసింది. ఒకప్పుడు ఇక్కడ రాజకీయ పోరు రెండు కుటుంబాల మధ్యే ఉండేది. పొన్నపురెడ్డి కుటుంబం దేవగుడి కుటుంబం మధ్యే ప్రధాన పోరు ఉండేది.

ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ టికెట్ పై గెలిచి అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవి పొందారు ఆదినారాయణ రెడ్డి. 2019లో కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలవడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ జమ్మలమడుగు ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

Jammalamadugu TDP candidate Bhupesh ready to contest as independent if ticket denied

భూపేష్ పరిస్థితేంటి..?

యువకుడైన భూపేష్ రెడ్డి జమ్మలమడుగులో తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ జనసేన బీజేపీల పొత్తు ఖరారు కావడంతో భూపేష్ రెడ్డి అభ్యర్థిత్వం ప్రశ్నార్థకంగా మారింది. భూపేష్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అనేది ఇటు జమ్మలమడుగులో అటు కడప జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. పొత్తులో భాగంగా బీజేపీ జమ్మలమడుగు టికెట్‌పై గురిపెట్టింది. ఎందుకంటే అక్కడ కమలం పార్టీ అభ్యర్థిగా చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దింపి సీటును కైవసం చేసుకోవాలని భావిస్తోంది. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి 2004, 2009,2014లో వరుసగా గెలిచారు.తనకంటూ బలమైన క్యాడర్‌నే సృష్టించుకున్నాడు.ఇది కాషాయ పార్టీకి కలిసొస్తుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు.

Jammalamadugu TDP candidate Bhupesh ready to contest as independent if ticket denied

కూటమి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి

ఇక ఈ మధ్యకాలంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి పెద్దగా యాక్టివ్‌గా లేరనే వార్తలు వస్తున్నాయి. టీడీపీకి చెందిన భూపేష్ రెడ్డి ఆది స్థానాన్ని రీప్లేస్ చేశారని నియోజకవర్గంలో టాక్. అదే సమయంలో భూపేష్ రెడ్డి రాజకీయంగా ఎదగాలని ఆదినారాయణ రెడ్డి సైతం కోరుకున్నారు. రెండు మూడు సందర్భాలలో కూడా ఆయన బహిరంగంగానే చెప్పారు కూడా. తాజాగా టీడీపీ-జనసేన-బీజేపీలు పొత్తుతో వెళుతుండటంతో జమ్మలమడుగు నుంచి కూటమి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి ఉంటాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఆదినారాయణ రెడ్డే కూటమి తరపున పోటీ చేస్తే భూపేష్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తన సన్నిహితులు చెబుతున్నారు.

ఇండిపెండెంట్‌గా భూపేష్..?

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ తరపున భూపేష్ రెడ్డి చాలా యాక్టివ్ అయ్యారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా భూపేష్ రెడ్డికి టికెట్ ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. దీంతో గ్రౌండ్ లెవెల్‌‌లో క్యాడర్‌ను బలోపేతం చేసుకుని తన వ్యూహాలను అమలు చేస్తున్నాడు. కొన్ని మండలాల్లో తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఆదినారాయణ రెడ్డి పోటీ చేసేపాటైతే భూపేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ తన సన్నిహితులు, తన క్యాడర్ ఒత్తిడి తీసుకొస్తోంది. మరోవైపు వైసీపీ నుంచి టికెట్ దక్కుతుందో లేదో అన్న మీమాంస నుంచి పూర్తిగా బయటపడ్డారు ఆ పార్టీ నేత ప్రస్తుత జమ్మలమడుగు అభ్యర్థి సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డికి రామసుబ్బారెడ్డి వర్గం కూడా తోడవడంతో జమ్మలమడుగులో తన విజయంపై ధీమాతో ఉన్నారు.

మొత్తానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమి నుంచి టికెట్ ఎవరికి దక్కుతుంది.. ఒకవేళ బాబాయ్ ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తే అబ్బాయ్ భూపేష్ రెడ్డి సహకరిస్తారా.. లేకుంటే అబ్బాయ్ పోటీ చేస్తే బాబాయ్ మద్దతిస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక బలమైన వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిని ఢీకొట్టేందుకు ఇద్దరూ కలిసొస్తారా.. లేక ఈ కూటమి ఇరు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుందా అనేది తెలియాలంటే జస్ట్ ఒక వారం రోజులు వేచి చూడాల్సిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+