టిపై జానా హెచ్చరిక, జగన్‌ను చెప్పులతో కొట్టే పరిస్థితి..

హైదరాబాద్: బిల్లు ఆలస్యమైతే ప్రజలకు మరిన్ని ఇబ్బందులు వస్తాయని, పరిస్థితులు చేజారకముందే ఈ సమావేశాల్లోనే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో చర్చించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి సూచించారు. జానా చాంబర్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు మంత్రులు, ప్రజాప్రతినిధులు సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం భేటీ అయ్యారు. అనంతరం జానా మీడియాతో మాట్లాడారు.

బిల్లు ఆలస్యమైతే మరిన్ని సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. నేతలు, ప్రజల మధ్య భావోద్వేగాలు మరింత పెరుగుతాయన్నారు. కాబట్టి ఈ సమావేశాల్లోనే బిల్లు పైన చర్చించి, పార్లమెంటుకు పంపించాలన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం అనేక రాష్ట్రాలు విడిపోయినట్లుగా తెలంగాణ ఏర్పడుతుందన్నారు. గందరగోళం సృష్టించడం ద్వారా బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ పైన కొందరు సీమాంధ్ర నేతలు ఒత్తిడి తెస్తున్నారని, స్పీకర్ పైన ప్రాంతీయతత్వం మోపడం సరికాదన్నారు. రాష్ట్రపతికి 15 రోజుల్లో బిల్లును పంపించాలని కోరారు.

Jana Reddy demands debate on Telangana Bill

అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టినందుకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, తమ పార్టీ అధినేత్రికి కృతజ్ఞతలు అన్నారు. తెలంగాణకు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు గతంలో అనుకూలంగా మాట్లాడాయని, ఇప్పుడు ముసాయిదా బిల్లు ప్రతులను చించివేయడం ఎంత వరకు సమంజసమన్నారు. సభలో బిల్లును ప్రవేశ పెట్టడం సంతోషకరమన్నారు. తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చకు తీసుకునేందుకు బిఏసిలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు రాజకీయ దిగజారుడు మాటలు చేయవద్దన్నారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు అలాగేనా మాట్లాడేదన్నారు. డిగ్గీని లాగి చెంపపై కొట్టాలని జగన్ అనడమేమిటన్నారు. ఇది సంస్కారహీనమన్నారు.

ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమా అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీలో ముఖ్యమంత్రిగా ఎదిగారనే విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలను పాలించే హక్కు జగన్‌కు లేదన్నారు. రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతోందన్నారు. జగన్ కొత్త పార్టీ పెట్టి వైయస్ ఆత్మకు క్షోభ కలిగిస్తున్నారన్నారు. అహంకారపు మాటలు మానుకోవాలని హితవు పలికారు. డిగ్గీని చెంపపై కొడతానన్న జగన్‌ను ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుందన్నారు.

గవర్నర్‌తో దానం భేటీ

గవర్నర్ నరసింహన్‌తో కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ భేటీ అయ్యారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చాంబర్లో సీమాంధ్ర ప్రాంత నేతలు భేటీ అయ్యారు.

నన్నపనేని ఉద్వేగం

తెలంగాణ రాకముందే ఇంత దౌర్జన్యం చేస్తే, వచ్చాక ఇంకేలా ఉంటుందోనని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆమె కౌన్సిల్ మీడియా పాయింటు వద్ద కిందపడిన విషయం తెలిసిందే. ఆనంతరం నన్నపనేని మాట్లాడుతూ... తమకే భద్రత లకేుంటే సీమాంధ్ర ప్రజలకు తెలంగాణలో ఇంకెక్కడ ఉంటుందన్నారు. సామాన్యులు ఎలా బతుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్నపనేని ఉద్వేగానికి లోనయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+