'దారి తప్పిన తమ్ముడు కిరణ్ రెడ్డి దారిలోకి రావొచ్చు'

రాష్ట్ర విభజనపై మంత్రివర్గ ఆమోదం లేకుండా ఎలాంటి నివేదికలు పంపేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న తయన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి పికె మహంతి విభజన తర్వాత ఎదురయ్యే సమస్యలు, సూచనలతో నివేదిక ఇచ్చారని తాను అనుకోవడంలేదని చెప్పారు.
ఆయన కేవలం సమాచారం మాత్రమే పంపారని భావిస్తున్నానని, ఆ సమాచారమైనా వాస్తవాన్నే ప్రతిబింబించాలని, కేబినెట్ ఆమోదం లేకుండా ఎలాంటి నివేదికలు పంపినా తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. అలాంటి నివేదికలను పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్రాన్ని, అధిష్ఠానాన్ని కోరుతామన్నారు.
ముఖ్యమంత్రి అధిష్ఠానం మాటను ధిక్కరిస్తున్నారని అనుకుంటున్నారా అని అడిగితే అవునన్నారు. వెంటనే ఆయన ధిక్కరిస్తున్నారో లేదో చిన్న పిల్లవాడిని అడిగినా తెలుస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో కిరణ్ పర్యటించకూడదని స్థానిక కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన మీరు కిరణ్ విషయంలో మాత్రం ఎందుకు మౌనం దాల్చుతున్నారని ప్రశ్నిస్తే.. తాము ఒకే పార్టీకి చెందిన వాళ్లమని, అభిప్రాయ బేధాలు ఉండవచ్చునని, దారి తప్పిన తమ్ముడు మళ్లీ దారిలోకి రావొచ్చన్నారు.












Click it and Unblock the Notifications