పవన్ కళ్యాణ్ సీరియస్: అందుకే నెమ్మదిగా, స్థిరంగా

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండు ముఖ్యమైన ఉత్సవాలను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని జనసేన తన విధాన పత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. యేటా ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని, జనవరి 26వ తేదీన భారత గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తుందని సమాచారం. అలాగే, తెలుగు ప్రజల రెండు రాష్ట్రాల ఆవిర్భావ దినాన్ని కూడా నిర్వహించుకుంటుంద. బహుశా ఇది జూన్ 2వ తేదీ కావచ్చు.

జయంతి, సాంస్కృతిక, మతపరమైన పర్వదినాలను నిర్వహించుకోకూడదని జనసేన నిర్ణయించినట్లు సమాచారం. జాతీయ సమగ్రతను కాపాడేందుకు వాటిని ఉపయోగించడానికి బదులు రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు వాటిని నిర్వహిస్తున్నారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత సంస్కృతి పట్ల, భారత భిన్న మత సంప్రదాయాల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Jana Sena to celebrate Formation day of the two Telugu States

పవన్ కళ్యాణ్ పార్టీ పట్ల చాలా సీరియస్‌గా ఉన్నారని చెబుతున్నారు. సమాజంలో పునాది స్థాయి నుంచి విప్లవాత్మక మార్పులు తేవడానికి కొత్త రాజకీయ నేతలను, శక్తులను రూపుదిద్దడమే పనిగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ నెమ్మదిగా, బలంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి.

సామామాజిక, రాజకీయ లక్ష్యాల విషయంలో తాత్కాలిక ఎన్నికల ప్రయోజనాలను కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉద్దేశించి రాజకీయ పార్టీని ముందుకు నడిపించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

జాగ్రత్తగా పరిశీలించి వేలాది మంది కార్యకర్తలను పార్టలో చేర్చుకునే పని ప్రారంభమైందని, సామాజిక సైన్యాన్ని తయారు చేయడానికి వారికి శిక్షణ ఇస్తారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+