లైవ్: లోకేష్ అవినీతికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది, జగన్‌నూ, కేంద్రాన్ని ఉతికి ఆరేసిన పవన్

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: భారత్ మాతాకై జై అంటూ జనసేన అధినేత తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సమస్యలపై పోరాటం తనకు ఇష్టమని చెప్పారు. ప్రజలను మోసంచేసి మభ్యపెట్టి వాళ్లు పబ్బం గడుపుకుంటూ ఉంటే మీరు వచ్చి మొరపెట్టుకుంటుంటే ఎంత బాధ, ఆవేశం ఉంటుందో మీకు తెలుసునని, అదే ఉద్దేశంతో జనసేన పార్టీ పెట్టానని అన్నారు.

తెలంగాణను ఏర్పాటు చేసే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విడదీశారని విమర్సించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలని బిజెపి తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకు, జగన్‌కు వాళ్ల భయాలు వారికి ఉండవచ్చు, కేంద్రమంటే తనకు భయం లేదని అన్నారు.

ప్రత్యేక హోదా మన ఆత్మగౌరవం విషయమని, కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. సెంటిమెంటుతో ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అనడాన్ని ఆయన తప్పు పట్టారు. సెంటిమెంటుతోనే తెలంగాణ ఇచ్చారని ఆయన అన్నారు. పాతిక మంది ఎంపీలతో కేంద్రం ఐదు కోట్ల మంది ప్రజలను నియంత్రించాలని చూస్తోందని అన్నారు.

ఆ తర్వాత తెలుగులో తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశభాషలందు తెలుగు లెస్స అంటూ హిందీలో కూడా మాట్లాడవచ్చునని అన్నారు. మమ్మల్ని తొక్కించుకోవడానికా తాము గెలిపించిందని అన్నారు. మీ చేత, మీ పిల్లల చేత తొక్కించుకోవడానికా మీ వెంట నడిచిందని అడిగారు.

  జనసేన బహిరంగ సభ : ప్రజల్లో హాట్ టాపిక్

  కంచె చేను మేస్తుందనే సామెత తనకు గుర్తు వస్తోందని అన్నారు. ఇది ఆర్గనైజేష్ కాదా, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పోరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాదా చూపిద్దామని అన్నారు.

  మందుపాతరలు పెట్టి రాజకీయ నాయకులు చంపేస్తారని, వెంటాడి చంపేస్తారని అన్నారు. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు నా తమ్ముళ్లను ఎందుకు త్యాగం చేయమంటాడని అన్నారు. వెనక కూర్చుని సమాధుల మీద నడవలేనని, మీ ప్రాణాలు చాలా విలువైనవని, అందుకే బాధ్యతగా మాట్లాడుతానని అన్నారు.

  కేంద్ర ప్రభుత్వమంటే మనవాళ్లకు భయమని అన్నారు. మనం ప్రకాశం పంతులు వారసులమని మనకేం భయం, పిరికితనమని అన్నారు. దోపిడీ చేసే వారికి భయమని, మనకు కాదని అన్నారు.

  అరుణ్ జైట్లీని ఉద్దేశించి ఆంగ్లంలో మాట్లాడుతూ - నేను పవన్ కల్యాణ్, అమరావతి నుంచి మాట్లాడుతున్నానని, నాలుగేళ్ల నుంచి ఎపికి అన్యాయం చేస్తున్నరారని అన్నారు. మీ ప్రకటన మా గుండెలను మండేస్తుందని అన్నారు. విభజనలో ఎపికి అన్యాయం జరిగిందని అన్నారు.

  చట్టాలు మాకే గానీ మీకు కాదా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళనదిశగా నడిపించారని అన్నారు.

  తెలంగాణను ఏర్పాటు చేసే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విడదీశారని విమర్సించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలని బిజెపి తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకు, జగన్‌కు వాళ్ల భయాలు వారికి ఉండవచ్చు, కేంద్రమంటే తనకు భయం లేదని అన్నారు.

  ప్రత్యేక హోదా మన ఆత్మగౌరవం విషయమని, కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. సెంటిమెంటుతో ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అనడాన్ని ఆయన తప్పు పట్టారు. సెంటిమెంటుతోనే తెలంగాణ ఇచ్చారని ఆయన అన్నారు. పాతిక మంది ఎంపీలతో కేంద్రం ఐదు కోట్ల మంది ప్రజలను నియంత్రించాలని చూస్తోందని అన్నారు.

  ఆ తర్వాత తెలుగులో తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశభాషలందు తెలుగు లెస్స అంటూ హిందీలో కూడా మాట్లాడవచ్చునని అన్నారు. మమ్మల్ని తొక్కించుకోవడానికా తాము గెలిపించిందని అన్నారు. మీ చేత, మీ పిల్లల చేత తొక్కించుకోవడానికా మీ వెంట నడిచిందని అడిగారు.

  కంచె చేను మేస్తుందనే సామెత తనకు గుర్తు వస్తోందని అన్నారు. ఇది ఆర్గనైజేష్ కాదా, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పోరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాదా చూపిద్దామని అన్నారు.

  మందుపాతరలు పెట్టి రాజకీయ నాయకులు చంపేస్తారని, వెంటాడి చంపేస్తారని అన్నారు. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు నా తమ్ముళ్లను ఎందుకు త్యాగం చేయమంటాడని అన్నారు. వెనక కూర్చుని సమాధుల మీద నడవలేనని, మీ ప్రాణాలు చాలా విలువైనవని, అందుకే బాధ్యతగా మాట్లాడుతానని అన్నారు.

  సమాజం పట్ల ప్రేమ, మీ పట్ల ఆప్యాయత వల్ల పోరాటానికి ముందుకు వస్తున్నానని ఆయన అన్నారు. సమాజమన్నా, ప్రజలన్నా తనకు ప్రేమ అని అన్నారు. సాటి మనిషిని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారని, మన రాష్ట్రాన్ని మనం చూసుకోకపోతే ఢిల్లీవారు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని అన్నారు.

  తెలుగుదేశం పార్టీ ఓదిపోయి యుపిఎ అధికారంలోకి వచ్చి ఉంటే తనకేమి జరుగుతుందో తెలియదా అని ఆయన అడిగారు. మీకు అండగా ఉండాలనే కదా అన్నారు. తాను బిజెపి, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికే గాని తెలుగుదేశం పునర్నిర్మాణానికి కాదని అన్నారు.

  తాను ప్రజలేమి చేయగలనో అని చూశానని అన్నారు. చంద్రబాబును కలిసినప్పుడు 2 వేల నుంచి 3 వేల ఎకరాలు ఉంటే చాలు మంచి రాజధాని కట్టవచ్చునని అన్నారు. అది లక్ష ఎకరాలకు విస్తరించిందని అంటూ అభివృద్ధి కొందరికేనా, అందరికా అని అడిగారు. తెలుగుదేశం నాయకులు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు లేరని అన్నారు.

  ఉద్యోగాలు ఎలా ఇస్తారని అడిగారు. అభివృద్ధి అమరావతి చుట్టూ కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిస్తితి ఏమిటని అన్నారు తెలంగాణ లాంటి ఉద్యమం రాదా, ఆ దిశగా ఎందుకు ఆలోచించరని ప్రశ్నించారు.

  ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని అడిగినప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, పాచిపోయిన లడ్డూలు అంటే పాచిపోయిన లడ్డూలు ఆప్యాయంగా తింటామన్నారని, దానికి చట్టబద్దత కల్పించలేదని, ఒక ముఖ్యమంత్రి గానీ మంత్రులు గానీ ప్రజలను ఏమనుకుంటున్నారని, వారికి తెలివి, మేధస్సు లేవని అనుకుంటున్నారా అని అన్నారు. అలా అనుకుంటే పొరపాటు, నిశబ్దం చేతగాని తనం కాదని అన్నారు.

  2016లో జనసేన ఏం మాట్లాడానో, తాను ఏం చెప్పానో దానికే వచ్చారని, గవర్నర్‌ చేత అదే చెప్పించారని, ఆ విషయమే 2016లో ఎందుకు చెప్పలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రైవేట్ కాంట్రాక్టులను ఇప్పించుకున్నారని, ముంపు మండలాలను ఎపిలో ఎలా చేర్పించుకున్నారని, ప్రత్యేక హోదాపై ఎందుకు అలా చేయలేదని ఆయన చంద్రబాబును అడిగారు.

  వైసిపి నేతలు మాట్లాడుతారా అంటే అసెంబ్లీకే రారని అన్నారు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యానా, రావడానికి అన్నారు. ముఖ్యమంత్రి అయితేనే ప్రజా సమస్యలపై పోరాటానికి రావాలా అన్నారు. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి రావాలా అని అడిగారు. ప్రత్యేక హోదాపై పోరాటం కూడా చేయలేకపోయారని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను అన్నారు.

  మీ ప్రాణాలను ఫణంగా పెట్టబోనని, మీ తల్లిదండ్రులు సుఖంగా ఉండాలని, సభ పెడ్డాడు వెళ్తాడని అంటారని, మీరు వచ్చి మాట్లాడుతారని, మీరు వచ్చి మాట్లాడండి అని సవాల్ చేశారు. మీరేమిటి జనసేనను, పవన్ కల్యాణ్‌ను అనడానికి అన్నారు. సాటి మనుషుల కన్నీళ్లు చూసి తుడిచే శక్తి ఉందా మీకు అని అడిగారు.

  చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారని అంటారని, అమరావతి కాలేదని భావోద్వేగానికి గురయ్యారని అంటారని అన్నారు. గుంటూరులో కలరా వచ్చి చచ్చిపోతే భావోద్వేగం కలగదా అని అన్నారు. బయిటివారి బిడ్డలు బిడ్డలు కారా అని అడిగారు.

  స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఓటేయాలని మోడీ అన్నారని, స్కామ్ ఆంధ్ర కాలేదు గానీ కరప్షన్ ఆంధ్రగా మాత్రం తెలుగుదేశం నాయకులు చేశారని అన్నారు. ఇందుకా మేం మిమ్మలకు మద్దతు ఇచ్చిందని తెలుగుదేశం నాయకులు అడిగారు. దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోవడానికా తాను 2014లో మద్దతు ఇచ్చిందని అడిగారు.

  అనుభవం కావాలని మద్దతు ఇచ్చానని, మీ అబ్బాయి కరప్షన్... లోకేష్ గారి కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు గానీ ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

  లోకేష్ అవినీతి మీకు తెలియదా, తెలిసి ప్రోత్సహిస్తున్నారా అని ఆయన చంద్రబాబును అడిగారు. మీకు పార్టీపై పట్టులేదా, మీకు తెలిసే జరుగుతోందంటే సరికొత్త నాయకులను 2019 ఎన్నికల్లో ఎన్నుకుంటారని అన్నారు. 2014 ఎన్నికల లాగా 2019 ఎన్నికలు ఉండవని అన్నారు. మీ అవినీతికి ప్రజలు భయపడుతున్నారని ఆయన చంద్రబాబు ప్రభుత్వా్ని ఉద్దేశించి అన్నారు. కొత్త రాజకీయ శకం ప్రారంభమవబోతుంది, అయిందని అన్నారు. తెలుగుదేశం పార్ట ప్రభుత్వం వైఫల్యాలను ఈ రోజు నుంచి ఎండగడుతామని అన్నారు. ఇసుక మాఫియాకు అండదండలు ఇచ్చినందుకు నిలదీసి తీరుతామని అన్నారు.

  సభా ప్రాంగణానికి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. ఆయన రాక కోసం అభిమానులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. సిఎం పవన్ అంటూ సభా ప్రాంగణంలో నినాదాలు హోరెత్తుతున్నాయి.

  బారికేడ్లను తోసుకుంటూ అభిమానులు సభా వేదిక వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సాయంత్రం 5 గంటల 40 నిమిషాల ప్రాంతంలో వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయనకు దగ్గరగా రావడానికి అభిమానులు ముందుకు దూసుకు వచ్చారు. 

  సభలో పవన్ కల్యాణ్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొని ఉంది. ప్రత్యేక హోదా, కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయం వంటి విషయాలపై ఆయన ఏం మాట్లాడుతారనేది అందరికీ ఉత్కంఠగానే ఉంది.

  పార్టీ ఆవిర్బావ సభలో ఆయన బుధవారం సాయంత్రం ప్రసంగించారు. సభకు పెద్ద యెత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. బహిరంగ సభకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయమైన సంఘటనలు జరగుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Fans and workers gatthered to hear Jana Sens chief Pawan Kalyan speech at Guntur in Andhra Pradesh.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి