అన్నయ్యకు తమ్ముడి బర్త్‌డే విషెస్: సమ్‌థింగ్ స్పెషల్..!!

అమరావతి: మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు చలన చిత్ర పరిశ్రమను కొత్తపుంతలు తొక్కించిన కథా నాయకుడు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌తో సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న టాలీవుడ్ హీరో. ఎలాంటి బ్యా‌క్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అంచెలంచెలుగా ఎదిగారు. కేరీర్ ఆరంభంలో చిన్నపాత్రలను వేశారు. విలన్‌గా కూడా కనిపించారు. హీరోగా నిలదొక్కుకున్న తరువాత ఆయనకు ఎదురులేకుండా పోయింది.

67 సంవత్సరాల వయస్సులోనూ ఆయనలో మెరుపులు తగ్గలేదు. డాన్స్, ఫైట్స్‌లో చురుకు నెమ్మదించలేదు. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. రాజకీయాల్లోనూ సత్తా చాటారు. సొంతంగా రాజకీయ పార్టీని నెలకొల్పారు. అనంతరం కేంద్రమంత్రిగా సేవలను అందించారు. ఇవ్వాళ పుట్టినరోజును జరుపుకొంటోన్నారు మెగాస్టార్. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. చిరంజీవి పుట్టినరోశు శుభాకాంక్షలు తెలిపారు.

 Jana Sena Chief Pawan Kalyan birthday wishes to Mega Star Chiranjeevi.

చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పలేనని.. ఆయన జీవితం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. అన్నయ్యలో గొప్ప మానవతావాది ఉన్నారని, చెమటను ధారగా పోసి సంపాదించిన సొమ్ముతో చాలామందికి సహాయం చేశారని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మెగాస్టార్ సొంతమని, అలాంటి వ్యక్తికి తాను తమ్ముడిని కావడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో పనులు లేక సినీ కార్మికులు ఆకలితో అలమటించకుండా ఆయన చూపిన దాతృత్వాన్ని ఎవరూ మరిచిపోలేరని పవన్ కల్యాణ్ అన్నారు.

బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షలాది మందికి రక్తాన్ని అందించారని, ఆ రకంగా రక్త సంబంధాన్ని ఏర్పరచుకున్నారని చెప్పారు. వేలాదిగా గుప్త దానాలు చేశారని, ఇటీవలే ఉచిత ఆసుపత్రి స్థాపనను ప్రకటించారని గుర్తు చేశారు. అవన్నీ చిరంజీవిలోని మానవతామూర్తిని తెలియజేస్తాయని చెప్పారు. వయసు తారతమ్యాలు.. వైర్గ వైరుధ్యాలు..కులమతాలకు అతీతంగా ఆయన అందరినీ అక్కు చేర్చుకునే విశాల హృదయుడని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+