మీపై నాకు అనుమానం వస్తోంది, తప్పు చేయకుంటే లెక్క చెప్పొచ్చుగా: బాబుకు పవన్ కళ్యాణ్ షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu
  Pawan Kalyan Visits Polavaram Project and Gets Doubt On Chandrababu

  అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉదయం తొమ్మిది గంటలకు రాజమహేంద్రవరం రివర్ బే హోటల్ నుంచి బయలుదేరి పోలవరం చేరుకున్నారు. పవన్‌ను చూసేందుకు రివర్ బే హోటల్‌కు, పోలవరం ప్రాజెక్టు వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వచ్చారు.

  చంద్రబాబు వాడుకొని వదిలేస్తాడని తెలుసు, జగన్‌ది తప్పు, అందుకే మద్దతివ్వలేదు: పవన్, వైయస్‌పై..

  పోలవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడి అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. మ్యాప్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులను పరిశీలించి, పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఇంజినీర్లు ఆయనకు అన్నింటిని వివరించారు.

  చిరంజీవిని లాగి, పవన్ కళ్యాణ్‌కు సినిమా కౌంటర్ ఇచ్చిన రోజా

  హిల్ వ్యూ నుంచి ప్రాజెక్టు పరిశీలన

  హిల్ వ్యూ నుంచి ప్రాజెక్టు పరిశీలన

  రాజమహేంద్రవరం నుంచి కారులో పోలవరం చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు అధికారులు స్వాగతం పలికారు. ఆయన హిల్ వే నుంచి ప్రాజెక్టును సందర్శించారు. నిర్మాణ పనులు సాగుతున్న తీరును ఎస్‌ఈ వి.రమేష్ బాబు వివరించారు. స్పిల్‌వే, డయా ఫ్రంవాల్‌ నిర్మాణం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, నిర్మాణాల్లో ప్రగతిని ఇంజినీర్లు వివరించారు. పవన్‌ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

  పవన్ కళ్యాణ్ వారించినా

  పవన్ కళ్యాణ్ వారించినా

  పోలవరం ప్రాజెక్టు పద్ద పవన్ కళ్యాణ్‌ను చూడగానే అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం... సీఎం అంటూ గట్టిగా నినదించారు. దీంతో పవన్ అసంతృప్తికి లోనయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను ఇక్కడకు ఓ పని మీద వచ్చానని అభిమానులకు చెప్పారు. అలాంటి నినాదాలు చేయడం సరికాదని వారించారు. అయినా అభిమానులు నినాదాలు చేశారు.

  రూ.125 కోట్ల నుంచి వేల కోట్లకు పెరిగింది

  రూ.125 కోట్ల నుంచి వేల కోట్లకు పెరిగింది

  పోలవరం ప్రాజెక్టుకు 13వేల కోట్లకు పైగా అవుతుందని, పునరావాస కేంద్రాలకు రూ.3వేల కోట్లు అవుతుందని అధికారులు చెప్పారని, కానీ 2014 తర్వాత ప్రాజెక్టు వ్యయం పెరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు దశాబ్దాల క్రితం తొలుత ప్రతిపాదించినప్పుడు రూ.125 కోట్లు అని, ఇప్పుడు అది పెరిగి యాభై వేల కోట్లకు పైగా పెరిగిందన్నారు.

  నేను ఎవరినీ నిందించను, తీవ్ర పరిణామాలు

  నేను ఎవరినీ నిందించను, తీవ్ర పరిణామాలు

  పోలవరం ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో, పార్టీదో కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వచ్చానని చెప్పారు. ప్రాజెక్టు వల్ల లాభమేంటో, నష్టమేంటో అనేది పరిశీలించాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలు సాధారణం అన్నారు. పోలవరం ప్రాజెక్టులోను అవకతవకలు ఉన్నాయన్నారు. పోలవరం విషయంలో తాను ఎవరినీ నిందించడం లేదన్నారు. పోలవరం పూర్తి కాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

  లెక్కలు చెప్పొచ్చుగా.. చంద్రబాబుకు పవన్ ప్రశ్న

  లెక్కలు చెప్పొచ్చుగా.. చంద్రబాబుకు పవన్ ప్రశ్న

  పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం లెక్కలు అడుగుతోందని అవి చెబితే తప్పేమిటని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని అనుమానాలు వచ్చాయని, దాంతో లెక్కలు అడుగుతున్నారని, మనం ఏ తప్పు చేయనప్పుడు లెక్కలు చెబితే తప్పేమిటని అన్నారు. ఎందుకు అంత ఆలోచన అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌ట్రాయ్ సామర్థ్యం అన్నింటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు.

  తప్పు చేయకుంటే లెక్కలు చెప్పు, నేనూ కలిసి వస్తా

  తప్పు చేయకుంటే లెక్కలు చెప్పు, నేనూ కలిసి వస్తా

  కేంద్రానికి లెక్కలు చూపిస్తే స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకపోతే లెక్కలు ఎందుకు చెప్పదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. లెక్కలు చెబితే, శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పటికీ కేంద్రం స్పందించకుంటే పోలవరం ప్రాజెక్టుపై నేను కూడా మీతో కలిసి వస్తానని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.

  నాకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి

  నాకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి

  రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే నిజాలు దాస్తున్న కొద్ది తనకు కూడా సందేహాలు కలుగుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తి కాదని పవన్ కూడా అభిప్రాయపడ్డారు. ఏ విషయంలోనైనా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలని, తప్పులు జరుగుతుంటాయని, వాటిని సరిదిద్దేలా చూడాలని, కానీ వాటిని రాజకీయం చేయవద్దని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును ఎన్నికలకు వాడుకోవద్దన్నారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయి రాజధానే కట్టలేదన్నారు. ఏపీకి చంద్రబాబు అనుభవం ఉపయోగపడుతుందని ఇప్పటికీ నమ్ముతున్ననని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena chief and Power Star Pawan Kalyan visited polavaram project on Thursday Morning.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి