బాల్క సుమన్‌పై జనసేన ఫిర్యాదు, నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్/విశాఖ: పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నేత బాల్క సుమన్ పైన జనసేన పార్టీ కార్యకర్తలు జుబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్‌ను పవన్ కళ్యాణా లేక ప్యాకేజీ కళ్యాణా అని ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. బాల్క సుమన్ పైన కేసు నమోదు చేయాలన్నారు.
కేశినేని నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వెంటనే క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగింది.
పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేశినేని నానికి రాజీనామా చేసి మళ్లీ గెలిచే దమ్ముందా అని సవాల్ చేశారు. కేశినేని నాని, టీడీపీ ఎంపీల తీరును నిరసిస్తూ తిరుపతి, విశాఖ, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు తదితర ప్రాంతాల్లో జనసేన ఆందోళనలు చేపట్టింది.












Click it and Unblock the Notifications