పిఆర్పీలాగే: పవన్ సేనపై హరీష్, టి కాంగ్రెస్‌కు ఝలక్

Harish Rao
మెదక్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి.. నాటి ప్రజారాజ్యం పార్టీ గతే పడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు శుక్రవారం ధ్వజమెత్తారు. ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. ఏ పార్టీతోను పొత్తులుండవని చెప్పారు. కాంగ్రెసు పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని ధ్వజమెత్తారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం సాయంత్రం జగదేవపూర్ మండలం ఎర్రవ్పుల్లి శివారులోని తన సొంత వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌లో వ్పుచ్చిన కెసిఆర్ నేరుగా ఫాంహౌస్‌లోకి వెళ్లారు.

వచ్చే నెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఫాంహౌస్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అక్కడే మాకం వేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు, గతకొంత కాలంగా కత్తులు దూసుకుంటున్న తెలంగాణ కాంగ్రెసు, తెరాసల మధ్య పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధిష్ఠానం ఆదేశాలతో టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. తెరాస నుంచి పిలుపు వస్తే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు ప్రారంభమవుతాయంటున్నారు.

కాంగ్రెస్, తెరాస మైత్రీబంధం నాటకీయంగా మలుపు తిరిగిన నేపథ్యంలో, ఈ రోజు వెలువడాల్సిన టి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా తాత్కాలికంగా వాయిదా పడింది. తెరాసతో చర్చల అనంతరమే అభ్యర్థుల వివరాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించనుంది. అయితే, తెరాస మాత్రం తాము ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+