జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏం కోరుకుంటున్నారంటే..: హరిప్రసాద్

ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖలో యువత చేపట్టిన ఉద్యమానికి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని, కానీ అది ప్రజా ఉద్యమంగా జరగాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని జనసేన మీడియా అడ్వయిజర్ హరిప్రసాద్ తెలిపారు.

విశాఖ: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖలో యువత చేపట్టిన ఉద్యమానికి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని, కానీ అది ప్రజా ఉద్యమంగా జరగాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని జనసేన మీడియా అడ్వయిజర్ హరిప్రసాద్ తెలిపారు.

అంకెల గారడీతో ఉన్న ప్యాకేజీకి మనం ఎందుకు మద్దతు పలకాలని ప్రశ్నించారు. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న యువత గొంతు నొక్కేయ్యడం సరికాదన్నారు. యువత చేసే ఉద్యమానికి అన్ని పార్టీలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

Jana Sena media advisor on Pawan Kalyan's fight

ఇదిలా ఉండగా, హోదా అక్కర్లేదనే నేతలు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని సీపీఐ నేత రామానాయుడు తిరుపతిలో డిమాండ్ చేశారు. సంప్రదాయ జల్లికట్టు క్రీడపై నిషేధం విధిస్తామంటే తమిళనాడు ప్రజలు ఏకతాటిపైకొచ్చి పోరాడిందన్నారు.

హోదా కావాలి శాంతియుత పోరాటం చేస్తామంటే ప్రభుత్వం ముందురోజే హౌస్‌ అరెస్టులు చేయించడం దారుణమన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీనే తాము కోరుతున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+