దరఖాస్తు చేసుకోని వారికి గుడ్‌న్యూస్: దారంతా గోతులని.. పవన్ కళ్యాణ్ ఆసక్తికరం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: జనసేన ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గుంటూరు, ఏలూరులలో ఔత్సాహిక వేదికలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

18, 19 తేదీల్లో గుంటూరు, 20, 21 తేదీల్లో ఏలూరులో ఈ వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వక్తలు, విశ్లేషకులు, విషయ రచయితల కోసం గుంటూరు జిల్లా నుంచి 3786 దరఖాస్తులు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 4913 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో వచ్చాయని చెప్పారు.

దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి గుడ్ న్యూస్

దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి గుడ్ న్యూస్

దరఖాస్తులు చేసుకోలేకపోయినవారు కూడా శిబిరంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ సమయం, ఇతర వివరాలు ఎస్సెమ్మెస్, మెయిల్‌ చేస్తామని వెల్లడించారు.

గుంటూరు, ఏలూరులలో ఎక్కడ అంటే

గుంటూరు, ఏలూరులలో ఎక్కడ అంటే

మరిన్ని వివరాలు కావాలంటే జనసేన పార్టీ ఫేస్‌బుక్‌ పేజీ చూడాలని జనసేన అధినేత సూచించారు. గుంటూరులోని కలెక్టర్‌ ఆఫీసు రోడ్డులోని కిలారి కోటేశ్వరరావు ఫంక్షన్‌ హాలు(నగరపాలెం)లో, ఏలూరులోని రామకోటి దగ్గరి సీతారామ భర్తియా కల్యాణమండపం (మర్చంట్‌ ఛాంబర్‌)లో ఔత్సాహిక వేదికలు నిర్వహిస్తున్నామన్నట్లు తెలిపారు.

తెలంగాణలో విజయవంతం

తెలంగాణలో విజయవంతం

ఈ నెల 7వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన శిబిరంతో తెలంగాణలో కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

అప్పుడు దారంతా గోతులు

ఇదిలా ఉండగా, పవన్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. మూడేళ్ల క్రితం పార్టీ ప్రారంభించినప్పుడు దారంతా గోతులు అని, చేతిలో దీపం లేదని ధైర్యంతో ముందుకెళ్లామని పేర్కొన్నారు. జనసేనకు సామాజిక వేదికలో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్ పెట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Jana Sena Party (JSP) is organising meetings with those interested in serving the party as speakers, analysts, and content writers. The meetings will be held in Guntur on September 18 and 19, Eluru on September 20 and 21, and in Krishna district after Dasara, according to a release, 3,786 applications were received from Guntur district and 4,913 from West Godavari. Those who could not apply online can take part in the above programmes. The venues are Kilari Koteswara Rao Function Hall in Guntur and Sitarama Bhartia Kalyanamandapam in Eluru.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X