వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన, చిరుతో కానిది: పవన్ కల్యాణ్ పార్టీ ఎందుకు!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ పార్టీ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు!? అంటే వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు మరో విషయం చెప్పారు. విభజన తీరుకు నిరసనగానే పవన్ పార్టీ పెడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

విభజనతో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన చెందుతున్నారని గంటా శ్రీనివాస రావు బుధవారం చెప్పారు. పవన్‌కు భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే, పార్టీ పెట్టి కొన్ని సీట్లలో పోటీ చేసినంత మాత్రాన లాభం లేదని మాత్రమే తాను పవన్‌కు సూచించానని చెప్పారు.

పవన్ పైన తాను విమర్శలు చేసినట్లు వచ్చిన ఆరోపణలు సరికాదన్నారు. తాను ఎప్పుడు పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. న్యాయం కోసం టిడిపిలో కలిసి పోవాలని తాను కోరానని చెప్పారు. కాగా, పవన్ పార్టీ పెడుతుండటంతో అనేక రకాల వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

 పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ జన సేన పేరుతో ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీ పేరును దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 14న ఆయన ప్రకటన చేసే అవకాశముంది.

గంటా శ్రీనివాస రావు

గంటా శ్రీనివాస రావు

విభజన తీరుకు నిరసనగానే పవన్ కల్యాణ్ పార్టీ పెడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం పట్ల పవన్ ఆవేదనతో ఉన్నారన్నారు.

తెలంగాణ

తెలంగాణ

విభజన తీరుకు నిరసనగానే పవన్ కల్యాణ్ పార్టీ పెడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం పట్ల పవన్ ఆవేదనతో ఉన్నారన్నారు.

ప్రశ్నించేందుకే...

ప్రశ్నించేందుకే...

ప్రశ్నించేందుకే పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెడుతున్నారని చెబుతున్నారు. అధికారం కోసం కాకుండా ప్రజల తరఫున, ప్రజల సమస్యల పైన ప్రశ్నించేందుకే అంటున్నారు.

రాజకీయాలపై పూర్తి అవగాహన

రాజకీయాలపై పూర్తి అవగాహన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందంటారు. ఆయన ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. సహజంగానే సేవా భావం కలిగిన ఆయన పార్టీ ద్వారా ప్రజలకు చేయాలనుకుంటున్నారు. ప్రజలకు రాజకీయాల్లో ఏం చేయవచ్చునో అనే విషయమై ఆయన ఓ పుస్తకం కూడా రాశారు.

 చిరంజీవి

చిరంజీవి

తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పవన్... ప్రజలకు సేవ ఏదైనా చేయాలని భావించారట. చిరు తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో అసంతృప్తి చెందిన పవన్ ఇప్పుడు కొత్త పార్టీ ద్వారా ఏం చేయవచ్చునో నిరూపించాలనుకుంటున్నారట.

English summary
Everyone in Andhra Pradesh are eagerly looking forward to hear the details about Power Star Pawan Kalyan's political plans. The buzz is that No 1 Telugu actor has already registered Jana Sena as the name of his new political party. He is expected to reveal the party name and members of the party in his much-talked about press meet to be held at HITEX in Madhapur, Hyderabad on Friday evening (March 14).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X