అనంతలో సభ వేదిక ఖరారు, మూడు పేర్లు: అది జనసేన భాగ్యం.. పవన్

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన ఉద్యమిస్తున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురంలో నిర్వహించనున్న సభకు సీమాంధ్ర హక్కుల చైతన్య సభగా నామకరణం చేశారు. నవంబర్ 10వ తేదీన సభ జరగనున్న విషయం తెలిసిందే.

ఈ సభకు అనుమతి కోసం జనసేన దరఖాస్తు చేసుకుంది. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సభ నిర్వహిస్తారు. ఈ సభకు, వేదికకు, మైదానానికి వేరువేరు పేర్లు పెట్టారు.

ఈ సభకు సీమాంధ్ర హక్కుల చైతన్య వేదిక అని పెట్టారు. సభ జరిగే మైదానం పేరును తరిమెళ నాగిరెడ్డి అని నామకరణం చేసారు. సభావేదికకు కల్లూరి సుబ్బారావు అని పేరు పెట్టారు.

 Jana Sena names Pawan Kalyan Anantapur public meeting

అది జనసేన భాగ్యం: పవన్ కళ్యాణ్

నవంబర్ 10వ తేదీన సాయంత్రం 4గంటలకు సభ జరుగుతుందని ఆ పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సభ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కార్యకర్తలు, నేతలు చురుగ్గా చేపడుతున్నారన్నారు.

సభా ప్రాంగణానికి విప్లవ నేత తరిమెల నాగిరెడ్డి, సభా వేదికకు స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు పేర్లను పవన్‌ ఖరారు చేశారన్నారు. అనంతపురం జిల్లాలో పుట్టి రాష్ట్రానికి, ఈ దేశానికి అపార సేవలందించిన మహనీయులు నాగిరెడ్డి, సుబ్బారావులను ఈ సందర్భంగా స్మరించుకోవడం జనసేనకు కలిగిన భాగ్యంగా పవన్‌ వాఖ్యానించారు.

కాగా, ప్రత్యేక హోదా కోరుతూ ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ తిరుపతి, కాకినాడల్లో ఇప్పటికే సభలు నిర్వహించారు. మూడో సభకు అనంతపురం వేదిక కానుంది. పవన్‌ జనసేన పార్టీ పెట్టిన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బిజెపిల తరపున ఆయన ప్రచారం నిమిత్తం జిల్లాకు వచ్చారు.

అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ తరపున ప్రత్యేక కార్యక్రమం, సభ నిమిత్తం తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక హోదా అంశంతోపాటు, అనంత కరవు పరిస్థితులపై మాట్లాడే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+