సచిన్ ఎదుగుదల పివి వల్లే, పార్టీలో అవమానం: పవన్

నిజామాబాద్: తనకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అంటే ఎంతో ఇష్టమని, సచిన్ లాంటి వ్యక్తులు ఇంతస్థాయికి ఎదగడానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వర్గీయ పివి నర్సింహా రావు అన్నారు. పివి తెచ్చిన ఆర్థిక సంస్కరణ వల్లనే సచిన్ వంటి ఎందరో ఎండార్స్ మెంట్స్‌తో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారన్నారు.

సచిన్ అంటే తనకు కేవలం ఆట పరంగానే కాకుండా.. ఆయన ప్రవర్తనతోను తనకు ఎంతో ఇష్టమన్నారు. తనతో పాటు కోట్లాది మంది దేశ ప్రజలకు సచిన్ స్ఫర్తిప్రదాత అన్నారు. ఆయనకు, మరెందరికో పలు కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయని, అలా వారి ఎదుగుదలకు పివి తెచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమన్నారు.

Jana Sena party chief Pawan Kalyan speech in Nizamabad

పివి ఆర్థిక సంస్కరణల వల్లనే చాలామందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. తెలంగాణలో పుట్టి దేశాన్ని ముందుకు నడిపించిన అలాంటి నాయకుడికి కాంగ్రెసు పార్టీ గౌరవం ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో అంతిమ సంస్కారాలకు కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు.

తెలంగాణకు చెందిన సొంత పార్టీ నాయకుడి పైననే కాంగ్రెసు పార్టీకి ప్రేమ లేనప్పుడు తెలంగాణ ప్రజల పైన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పైన కాంగ్రెసు పార్టీది కపట ప్రేమ అన్నారు. రింగ్ రోడ్లు, దోపిడీ తప్ప కాంగ్రెసు దేని పైనా దృష్టి పెట్టలేదన్నారు.

తెలంగాణ బిడ్డను కాంగ్రెసు పార్టీ అవమానించిందన్నారు. గుజరాత్‌లో నిజంగానే అభివృద్ధఇ లేకుండే అక్కడి ప్రజలు మోడీని మూడుసార్లు ఎందుకు ఎన్నుకుంటారని ప్రశ్నించారు. మోడీ మాటల మనిషి కాదని చేతల మనిషి అన్నారు. ఆయన చుట్టూ క్రమశిక్షణ గల వారు ఉన్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+