తిరుపతిలో నాడు చిరు, నేడు పవన్: ఒక్క రోజు తేడా అంతే
తిరుపతి: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీని ప్రకటించిన రోజు తిరుపతి వేదిక అయ్యింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఓ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సరిగ్గా 8 సంవత్సరాల తరువాత ఒక్క రోజు తేడాతో తిరుపతిలో ఓ మెగా హీరో అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
8 సంవత్సరాల తరువాత ఒకే ఒక్క రోజు తేడాతో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఏర్పాటు చెయ్యడం వెనుక అసలు కారణాలు ఏంటి ? అని మెగా అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. చిరంజీవి తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు, పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ఓ లెక్కంది.

అదేంటంటే 2008 ఆగస్టు 26వ తేదిన మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలో లక్షలాధి మంది అభిమానుల సమక్షంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలోనే నాయకులు ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి రాజ్యసభ సభ్యుడి హోదాతో కేంద్ర మంత్రి అయ్యారు. సినిమాలకు దూరం అయిన చిరు రాజకీయ జీవితం గడిపి ఇప్పుడు మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు.

ఒక్క రోజు తేడాతో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ !
2016 ఆగస్టు 27వ తేదిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగా బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించనున్నారు. ఆయన ఏమి మాట్లాడుతారు అని అభిమానులు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ ఏ విషయాలు మాట్లాడుతారు అని గుమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నేటి నుంచి క్రీయాశీలకంగా ముందుకు నడిపిస్తారా ? అని చర్చించుకుంటున్నారు.
మొత్తం మీద అన్న చిరంజీవి తిరుపతిలో (2008 ఆగస్టు 26) బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు, తమ్ముడు పవన్ కళ్యాణ్ అదే తిరుపతిలో (2016 ఆగస్టు 27)న బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం పవన్ కళ్యాణ్ స్పీచ్ వినడానికి టీవీల ముందు కుర్చున్నారు. పవన్ కళ్యాణ్ కు ఓ లెక్కుంది అంటున్నారు ఆయన అభిమానులు.












Click it and Unblock the Notifications