Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బస్సుయాత్ర: ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ సిద్ధం! పర్సనల్‌గా టచ్ చేస్తే అంతే!!

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్రతో ప్రజల ముందుకు రానున్నారు. తొలుత పాదయాత్ర నిర్వహించాలని భావించినా, తర్జన భర్జన అనంతరం మే 15వ తేదీ నుంచి బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. పవన్ ప్రజల్లోకి వస్తే తమపై ఎంత ప్రభావం చూపుతుంది, ఎలా ప్రభావం చూపుతుందనే అంశాలపై ఇప్పటికే ఆయా పార్టీలు లెక్కలు వేసుంటున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ మరో పదిపన్నెండు రోజుల్లో ప్రజల్లోకి రానున్నారు. ఆయనపై టీడీపీ, బీజేపీ, వైసీపీలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవలి వరకు టిడిపి ఆయనపై మౌనంగానే ఉంది. ఎప్పుడైతే లోకేష్, టీడీపీపై అవినీతి ఆరోపణలు చేసి నిప్పులు చెరిగారే అప్పటి నుంచి టీడీపీ నేతలు నేరుగా విరుచుకుపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ సిద్ధం

పవన్ కళ్యాణ్ సిద్ధం

ఇక, పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వస్తే ఆయనపై మాటల దాడి చేసేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీలు సిద్ధంగా ఉన్నాయట. అయితే, అందుకు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలు కూడా సిద్ధంగానే ఉన్నాయని అంటున్నారు. ఎలాంటి విమర్శలు చేసినా ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

పవన్ బస్సు యాత్రలో లోకేష్ అంసం

పవన్ బస్సు యాత్రలో లోకేష్ అంసం

పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పైన అవినీతి ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించినా, లోకేష్ మాత్రం ఆచితూచి స్పందించారు. ఈ విషయం పక్కన పెడితే లోకేష్ అవినీతికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పుడు పవన్ పాదయాత్రలోను ఈ అంశాన్ని లేవెనత్తే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. పవన్ తన పర్యటనలో టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు లోకేష్ అంశంపై స్పందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 ఆధారాలతో పవన్ షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా?

ఆధారాలతో పవన్ షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా?

లోకేష్ పైన ఆరోపణలు చేస్తే టిడిపి నేతలు ఎదురుదాడికి దిగడానికి సిద్ధంగా ఉంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లోకేష్, మరికొందరు టీడీపీ నేతలకు సంబంధించి పలు ఆధారాలు సేకరించి పెట్టుకున్నారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తే ఆ ఆధారాలతో వారికి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారనే ప్రచారం సాగుతోంది. ఆధారాలు లేకుంటే మాత్రం బస్సు యాత్రలో లోకేష్ అవినీతి ప్రస్తావన తెచ్చే అవకాశముండదని అంటున్నారు.

నాడు ఊహించని షాకిచ్చారు, ఇప్పుడూ అలాగేనా?

నాడు ఊహించని షాకిచ్చారు, ఇప్పుడూ అలాగేనా?

పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తున్నారనే విషయమై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఆయన హఠాత్తుగా ట్విట్టర్లో లేదా మరో రకంగా ప్రకటించి ముందుకు సాగుతున్నారు. జనసేన ఆవిర్భావ సభకు ముందు ఆయన తీరు టీడీపీకి అనుకూలంగా కనిపించింది. కానీ ఆ సభలో ఎవరూ ఊహించని షాకిచ్చారు. హఠాత్తుగా టీడీపీపై ముఖ్యంగా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా అలాగే తన ఆరోపణలు నిజమని చెప్పేందుకు ఆయన ఆధారాలు సేకరించి ఉండవచ్చునని, బస్సు యాత్ర సమయంలో నిలదీస్తే సమాధానం చెప్పే అవకాశముందని అంటున్నారు.

పర్సనల్ లైఫ్ టచ్ చేసినా

పర్సనల్ లైఫ్ టచ్ చేసినా

పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్‌ను కొందరు టచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఆయన అంతే ఘాటుగా సమాధానం చెప్పారు కూడా. ఇప్పుడు ఆయనకు బస్సు యాత్ర సందర్భంగా ఇలాంటి అనుభవం ఎదురైనా అందుకు సమాధానంతో సిద్ధంగా ఉన్నారట.

లక్ష్మణ రేఖ దాటితే ఆధారాలతో సహా.. హెచ్చరిక

లక్ష్మణ రేఖ దాటితే ఆధారాలతో సహా.. హెచ్చరిక

జనసేన పార్టీ నేత అద్దేపల్లి శ్రీధర్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ పెళ్లికి సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చేందుకు జనసేన సిద్ధంగా ఉందని, పవన్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే సమాధానం చెప్పేందుకు తాము సిద్ధమని, పవన్ పెళ్లిళ్ల విషయంలో ఎవరైనా నాయకులు లక్ష్మణ రేఖ దాటితే ఆధారాలతో సహా అవతలి వారి విషయాలు బయటపెట్టేందుకు వెనుకాడదని హెచ్చరించారని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+