• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌న సైనికుడి తొలి అడుగు..! తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇద్ద‌రు కీల‌క నేత‌లు జ‌న‌పేన‌లోకి..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్/ఏపి: ఒక ప‌క్క ప్ర‌జా పోరాట యాత్ర‌.. మ‌రో ప‌క్క పార్టీ సంస్థాగ‌త బ‌లో పేతం.. ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపిస్తున్న త‌రుణంలో అభ్య‌ర్థుల ఎంపిక.. ప్ర‌స్తుతం జ‌న‌సేనాని ల‌క్ష్యాలు ఇవే..! అందుకు త‌గ్గ‌ట్టుగానే జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభ్యర్ధుల ఎంపిక కూడా చాప కింద నీరులా నిశ్శ‌బ్దంగా చేసుకుంటూ పోతున్నారు. చేరికలు, అభ్యర్ధుల విషయాలతో పాటు నియోజ‌క‌వ‌ర్గాల ఖ‌రారు అంశాలు బయటకు వస్తే రాజకీయంగా ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో చాలా విషయాలు బహిర్గతం కాకుండా చూసుకుంటున్నారు ప‌వ‌న్. అంతే కాకుండా తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ఇద్ద‌రు ప్ర‌ముఖ నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరిపోయేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. జ‌న‌సేన పార్టీలోకి వీరి చేరిక దాదాపు ఖ‌రారైన‌ట్టు జనసేన వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

గెలుపుగుర్రాల ఎంపిక‌లో జ‌న‌పేనాని..! మొద‌లైన అభ్య‌ర్థుల ఎంపిక‌..!

గెలుపుగుర్రాల ఎంపిక‌లో జ‌న‌పేనాని..! మొద‌లైన అభ్య‌ర్థుల ఎంపిక‌..!

తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన ఇప్పటికే రెండు ఎంపీ సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేసుకుందా?. అంటే అవుననే చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. అమలాపురం బరి నుంచి పవన్ పార్టీ తరపున మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ ను దింపే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. సామాజిక అంశాల పరంగా చూస్తే హర్షకుమార్ ఈ సీటులో గెలుపు నల్లేరుపై నడక కాగలదని లెక్కలు వేసుకుంటున్నారు. బీజెపీ కి చెందిన మ‌రో ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ కూడా జ‌న‌సేన తీర్థం పుచ్చుకుని రాజ‌మండ్రి లోక్ స‌భ నుంచి ఎన్న‌క‌ల బ‌రిలో దిగేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

 మొద‌ట ఉత్తరాంద్ర టార్గెట్..! ఆ త‌ర్వాత కోస్తాంద్ర అంటున్న ప‌వ‌న్..!!

మొద‌ట ఉత్తరాంద్ర టార్గెట్..! ఆ త‌ర్వాత కోస్తాంద్ర అంటున్న ప‌వ‌న్..!!

జనసేన ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతంపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రాధాన్యతా క్రమంలో పవన్ ఆయా ప్రాంతాల్లో జిల్లాల్లో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అమలాపురం ఎంపీ సీటు ఖచ్చితంగా తమదే అవుతుందని జనసేన ధీమాగా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యానారాయణ కూడా త్వరలోనే జనసేన లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు రాజమండ్రి ఎంపీ బరిలో జనసేన తరపున ఆయన నిల‌బ‌డ‌తార‌ని తెలుస్తోంది.ఆర్థికంగా ఆకుల సత్యనారాయణ బలమైన అభ్యర్ధి కావటం, పవన్ ఇమేజ్ తోడు అవటం వల్ల రాజకీయంగా ఇది తమకు లాభిస్తుందనే లెక్కల్లో ఆకుల వ‌ర్గం ఉన్న‌ట్టు స‌మాచారం.

ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు మ‌న‌వే..! ఒక్క సీటు కూడా విడ‌వొద్దంటున్న జ‌న సైనికులు..!!

ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు మ‌న‌వే..! ఒక్క సీటు కూడా విడ‌వొద్దంటున్న జ‌న సైనికులు..!!

అంతే కాకుండా తూర్పు గోదావరి జిల్లా లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ త‌గ‌ల‌బోతోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోకి చేరేందుకు రెడీ అయిపోయారు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా ఆ పార్టీలో చేరనున్నారని జనసేన వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుందనే విషయం ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ విషయాన్ని గ్రహించే నేతలు వచ్చే ఎన్నికల్లో తాము తేలిగ్గా గెలుస్తామ‌ని, మళ్ళీ తిరిగి అసెంబ్లీ అడుగుపెట్టేందుకు అనువైన పార్టీ ఏది అనే అంశంపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు.

టీడిపి, వైసీపి నుండి నేత‌ల వెల్లువ‌.! జ‌న‌సేన ప్ర‌త్యామ్నాయ పార్టీగా ఎద‌గ‌డం ఖాయ‌మంటున్న నేత‌లు..

టీడిపి, వైసీపి నుండి నేత‌ల వెల్లువ‌.! జ‌న‌సేన ప్ర‌త్యామ్నాయ పార్టీగా ఎద‌గ‌డం ఖాయ‌మంటున్న నేత‌లు..

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన టీడిపి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో తోట త్రిమూర్తులు పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు రైతు రుణ మాఫీ విషయంలో జిల్లాలోని రైతాంగం ఎక్కువ శాతం టీడీపీ అంటే వ్యతిరేకంగా ఉండటం, పవన్ పార్టీ వంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీలో ఉంటే గెలుపు కష్టం అవుతుందనే ఆయన జనసేన వైపు వెళ్ళటానికి రెడీ అయిపోయారని తెలుస్తోంది. ఇవే ప‌రిణామ‌లు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌తో పాటు ఉత్త‌రాంధ్రలో ఊపందుకుంటే జ‌న‌సేన పార్టీ ఇఆత‌ర పార్టీల‌కు చుక్క‌లు చూపించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

English summary
janasena chief pavan kalyan becoming strengthen day by day.in uttarandhra jopinings are taking place and selection of the candidates are finalising. in 2019 elections pavan may influence the voters and he may become king or king maker in ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X