వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన ట్విట్టర్ ఖాతాలు వెనక్కి ... జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ తో దిగొచ్చిన ట్విట్టర్ !!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ జనసైనికుల 400 ట్విట్టర్ అకౌంట్లు సస్పెండ్ చేసింది ట్విట్టర్ . ఊహించని పరిణామంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఇండియా ను నిలదీశారు. సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ పై యుద్ధం ప్రకటించారు. బ్రింగ్ బ్యాక్ జేఎస్పీ ట్యాగ్ తో సోషల్ మీడియా లో జనసైనికులు ట్విట్టర్ పై చిన్నపాటి సమరమే చెయ్యాల్సి వచ్చింది . పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క ట్వీట్ తో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ని ప్రశ్నించారు. ఇక ఆయన ట్వీట్ తో ట్విట్టర్ దిగొచ్చింది. ఫలితంగా జనసేన ట్విట్టర్ ఖాతాలు మళ్ళీ పునరుద్ధరించబడ్డాయి .

జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం పని చేస్తున్న వారి ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ చెయ్యటంపై తన ట్వీట్‌లో 'జనసేనకు మద్దతుగా ఉన్న 400 ట్విట్టర్ అకౌంట్లు ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు . నిస్సహాయులు, వారి సమస్యల్ని తెలుసుకొని అండగా నిలబడటం దీనికి కారణమా ?.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ పవన్ ట్విట్టర్ ఇండియా ను ట్యాగ్ చేసి ప్రశ్నించారు. . #BringBackJSPSocialMedia అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఆయన ట్వీట్ చేశారు . సోషల్ మీడియా పైన కూడా పోరాటం చేసి తమ సోషల్ మీడియా ని వెనక్కి తీసుకుందామని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.

Jana Sena Twitter Accounts re opened.. pawan says thanks to twitter

ఫలితంగా జనసేన ట్విట్టర్ అకౌంట్లు శుక్రవారం మళ్ళీ తెరుచుకున్నాయి. ట్విట్టర్ సంస్థ జనసేన కార్యకర్తల ఖాతాలు పునరుద్ధరించటంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. జనసైనికులు తమ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు ట్విట్టర్ దిగొచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక జనసైనికుల ఖాతాలు ఓపెన్ కావటంతో పవన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. ట్విట్టర్ ఇండియా కి కృతజ్ఞతలు చెబుతూ, భావ ప్రకటనా స్వేచ్ఛకి అనుకూలం గా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు . ఏదేమైనా పవన్ అభిమానులు సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ సంస్థ మెడలు వంచి తిరిగి ఖాతాలు తెరిపించారని పవన్ కళ్యాణ్ కు తెగ కితాబిచ్చేస్తున్నారు .

English summary
Janasena's Twitter accounts reopened on Friday. The renewal of accounts of the Twitter company Janesena activists has become a rage in the party lines. Pawan Kalyan's tweet on Twitter has been re tweeted by the general public. So, twitter reopened the accounts .. pavan said Thanks to Twitter India, he tweeted that the decision was in favor of freedom of expression
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X