బాలకృష్ణ తిడితే పెట్టలేదే, తెలంగాణలోనూ కొత్త మార్పులు, ప్రభుత్వం నాదే.. నమ్మండి: పవన్
రాజమహేంద్రవరం: తాను అందరివాడిని అని, కుల, మత, ప్రాంతాలకు అతీతమైన వాడినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం చెప్పారు. పెద్ధాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను అణగారిన వర్గాలకు అండగా నిలుస్తానని చెప్పారు. 2019లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్బాటు చేయబోవని జోస్యం చెప్పారు. అవినీతి నిరూపించాలని లోకేష్, టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారని, కానీ లోకేష్ సూరంపాలెం వస్తే మీ వాళ్ల అవినీతిని తప్పకుండా చూపిస్తానని, ఎస్సీలకు ఎన్టీఆర్ ఇచ్చిన భూములను దోచారని ఆరోపించారు.

తప్పు చేస్తే ధర్మం అవకాశమిస్తుంది
జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్లపై తిరుగుతుంటే ప్రభుత్వాన్ని ఎవరు నిలదీస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఏడాది మార్చిలో గుంటూరు సభలో తాను టీడీపీ అవినీతిపై మాట్లాడితే.. తానేదో హఠాత్తుగా మారినట్లుగా టీడీపీ నేతలు విమర్శించారని, కానీ తాను ధర్మం వైపు నిలబడతానని అన్నారు. 2014లో తాను టీడీపీకి మద్దతివ్వడం ధర్మమని చెప్పారు. దేవుడు లేని ఊళ్లో మంచం కోడెనే పోతురాజు అంటారని, అలాగే అప్పుడు ఉన్నవి టీడీపీ, వైసీపీ, వైసీపీ జగన్ అవినీతి కేసుల్లో ఉన్నారని, పైగా చంద్రబాబుకు అనుభవం ఉందని, అందుకే మద్దతిచ్చానని చెప్పారు. తప్పు చేస్తే ధర్మం ఓ అవకాశమిస్తుందని, లేదంటే నిర్దాక్ష్యిణ్యంగా అలాంటివారిని కూలదోస్తుందన్నారు.

బాలకృష్ణ మాటేమిటి.. లఫూట్ అని తిడితే డిబెట్లు పెడతారా?
తాను అక్రమాలకు పాల్పడుతున్న ఆండ్రూ కంపెనీ వాడిని లఫూట్ అని తిడితే టీవీ ఛానల్స్ డిబేట్ పెట్టాయని, మరి అడ్డగోలు తవ్వకాల గురించి లేదా బాలకృష్ణ అమ్మ, ఆలీ బూతులు తిట్టినప్పుడో ఎందుకు పెట్టలేదని పవన్ ప్రశ్నించారు. ధర్మపోరాట దీక్షలో ప్రధానమంత్రి తల్లిని బాలకృష్ణ తిట్టలేదా, పవన్ కళ్యాణ్ గోక్కున్నాడు, లఫూట్ అన్నాడు అని మాత్రం డిబేట్లు పెడతారా అని ఎద్దేవా చేశారు. దెందులూరు ఎమ్మెల్యే మహిళా తహసీల్దారును కొట్టినప్పుడు, మాదిగలను తిట్టినప్పుడు డిబేట్లు పెట్టరని, మా జనసైనికులు, అభిమానులే నా ఛానల్స్ నా ఫేస్‌బుక్, నా రేడియో నా పత్రికలు అన్నారు.

నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా.. మీకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు
రాష్ట్ర రాజకీయాల్లో బలమైన మార్పు వస్తుందని, సరికొత్త పరిస్థితులు, సమీకరణల వల్ల జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్ అన్నారు. భగవంతుడి సాక్షిగా చెబుతున్నానని, మార్పు తీసుకు వస్తానని, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతానని, ఇక మీకెందుకు నమ్మబుద్ధి కలగడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణలోను బలమైన మార్పులు
2019 ఎన్నికలు చాలా కీలకమైనవని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాబోయేవి సంకీర్ణ రాజకీయాలు అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ బలమైన మార్పులు రాబోతున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో దూకడం సామాన్య విషయం కాదని చెప్పారు.

నా తల్లి ఇచ్చన పించన్‌పై ఒట్టేసి చెబుతున్నా
జనసేన పార్టీ కోసం తన తల్లి రూ.3 లక్షలు తన పింఛన్ నుంచి ఇచ్చిందని, ఆ డబ్బుపై ఒట్టేసి చెబుతున్నానని, ప్రభుత్వం రాగానే భాగస్వామ్య పింఛను విధానాన్ని రద్దు చేస్తానని చెప్పారు. బలమైన టీడీపీని, రూ. వేల కోట్లు ఉన్న వైసీపీని జనసేన ఎదుర్కొంటుందని చెప్పారు. ప్రస్తుత కాలంలో మనకున్న గాంధీలు జగన్, చంద్రబాబు, లోకేశ్‌లేనని పవన్ ఎద్దేవా చేశారు. దేవుడని మొక్కితే దయ్యమై కూర్చున్నట్లు చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేసేశారని ఆరోపించారు. 2019లో ఎట్టిపరిస్థితుల్లోనూ టీడపీని అధికారంలోకి రానివ్వక పోవడమే ధర్మమన్నారు.












Click it and Unblock the Notifications