వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఊసరవెళ్లి..ఇదిగో ఇలానా' 'ఒత్తిడిలో చంద్రబాబు', పవన్‌పై విమర్శలకు ప్రశ్నల వర్షం!

|
Google Oneindia TeluguNews

తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం గుంటూరు సభలో టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ట్విస్ట్ మీద ట్విస్ట్ కొనసాగుతోంది.

చదవండి: చాలామందిని సీనియర్లను కలిశా, అదీ మాట్లాడుతా: పీఆర్పీపై పవన్ కళ్యాణ్

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ ఉందని, వైసీపీతో వెళ్లాలని వారు భావిస్తున్నారని, ఇందుకు వైసీపీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ నేతలు అంటున్నారు. ఏపీలో తమిళనాడు తరహా డ్రామా నడిపించాలని బీజేపీ చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

చదవండి: ఎవరితో మాట్లాడలేదు, అందరినీ కూడగట్టను: బాబు ఊహించని ట్విస్ట్, పవన్‌కు హెచ్చరిక

తాను ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుతుంటే పవన్ కళ్యాణ్ లాంటి వారు తనను బలపర్చాల్సింది పోయి, బలహీనపర్చే ప్రయత్నాలు చేయడమేమిటని, పీఎంవో వద్ద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎందుకు పడిగాపులు కాస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

చదవండి: బుక్కయ్యారంటూ.. అంతలో ఒంటరై!: పవన్-జగన్‌లపై బాబు ప్లాన్ రివర్స్, ఢిల్లీలో చక్రం

ఇదిగో.. టీడీపీ ఊసరవెళ్లిలా

ఇదిగో.. టీడీపీ ఊసరవెళ్లిలా

దీనికి వైసీపీ,జనసేన కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. టీడీపీ ఊసరవెల్లిలా వ్యవహరిస్తోందని, వైసీపీ అవిశ్వాసానికి మద్దతు ఎందుకివ్వాలని మొదట, ఆ తర్వాత పవన్ విమర్శించాక మద్దతిస్తామని చెప్పారని, ఇప్పుడు వారే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లి సొంతగా అవిశ్వాసం అంటున్నారని, ఇవన్నీ ఊసరవెళ్లి రాజకీయాలకు నిదర్శనం అని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు.

ఇది దేనికి సంకేతం

ఇది దేనికి సంకేతం

ఇటీవల ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి నేపథ్యంలో ఆ పార్టీకి దూరం జరిగితే మంచిదనే ఉద్దేశ్యంతో టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చారే తప్పితే హోదాపై చిత్తశుద్ధితో కాదని, 24 గంటల్లోనే ఎన్డీయే నుంచి బయటకు రావడం, తమకు మద్దతిస్తామని, వారే పెట్టాలని అనూహ్య నిర్ణయం తీసుకోవడం, మేం అందరి మద్దతు కూడగట్టాక ఇప్పుడు తామే అవిశ్వాసం పెడతామనడం దేనికి సంకేతమని టీడీపీని వైసీపీ ప్రశ్నిస్తోంది. మోడీతో జగన్ జతకడితే అవిశ్వాసం ఎలా పెడతామని, పవన్ నిన్నటిదాకా మంచివాడైతే ఇప్పుడు చెడ్డవాడు అయ్యారా, ఇది ఊసరవెల్లిలా మాట మార్చడం కాదా అని రోజా అన్నారు.

మొదటి నుంచి బీజేపీని టార్గెట్ చేసిన పవన్

మొదటి నుంచి బీజేపీని టార్గెట్ చేసిన పవన్

ఇక, పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు కూడా అర్థం లేదని కొందరు అంటున్నారు. 2014 ఎన్నికల తర్వాత పవన్ పదేపదే కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేశారని, చివరకు గుంటూరు సభలో టీడీపీని టార్గెట్ చేసినట్లు కనిపించినా హోదాపై మోడీకి ఆమరణ నిరాహార దీక్ష పేరుతో అల్టిమేటం జారీ చేశారని, జైట్లీని ఇంగ్లీష్‌లో ప్రశ్నించారని, అలాగే వామపక్షాలతో కలిసి వెళ్తానని స్పష్టంగా చెప్పారని అలాంటప్పుడు పవన్ వెనుక బీజేపీ ఉందని ఎలా చెప్పగలుగుతారని అంటున్నారు.

అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు సమాధానం ఏమిటి?

అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు సమాధానం ఏమిటి?

వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పినప్పుడు చంద్రబాబు దాంతో ఏం ఒరుగుతుందని ఇటీవలే అన్నారని, ఆ తర్వాత వైసీపీకి మద్దతిస్తామని, ఇప్పుడు తామే అవిశ్వాసం పెడతామని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అంటే ఊసరవెళ్లిలా ఎవరు రంగులు మారుస్తున్నారని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇలా అంటూ

ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇలా అంటూ

ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్నో మాటలు మార్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. తొలుత పదేళ్లు హోదా అన్నారని, ఆ తర్వాత ప్యాకేజీ అన్నారని, హోదా మాట ఎత్తితే జైలుకు పంపిస్తామని చెప్పారని, జగన్, పవన్ కళ్యాణ్‌లు ప్రత్యేక హోదాపై గళమెత్తడం, ప్రజలు సెంటిమెంటుగా భావించడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు.

పవన్ యాక్టివ్ అయ్యాడు కాబట్టి

పవన్ యాక్టివ్ అయ్యాడు కాబట్టి

లోకేష్, టీడీపీపై పవన్ చేసిన ఆరోపణలపై తెలుగు తమ్ముళ్లు ధీటుగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లకు అవినీతి గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. అయితే, ప్రత్యేక హోదా, అవిశ్వాసంపై ఇన్ని మాటలు మార్చిన మీకు హోదా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఎప్పటి నుంచో ఈ అంశాన్ని ప్రస్తావిస్తోందని అంటున్నారు. అవిశ్వాసం, హోదా విషయంలో అనూహ్యంగా చకచకా ఎందుకు పావులు కదిపారని అంటున్నారు. తాను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనులు చేయనని, ప్రజలకు పని చేసేలా చేయడమే తన ఉద్దేశ్యమని పవన్ పలుమార్లు తన అభిప్రాయం వ్యక్తం చేశారని, ఇప్పుడు ఆయన దృష్టికి రావడంతో ఆరోపణలు చేశారని అనుకోవచ్చు కదా అంటున్నారు. నాలుగేళ్లుగా యాక్టివ్‌గా లేరని వారే అంటారని, యాక్టివ్ అయ్యాక అన్నింటి పైనా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు పదేపదే జగన్ కేసుల గురించి మాట్లాడటం ఏమిటని కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. ఆర్థిక నేరస్తుడికి ప్రధాని అపాయింటుమెంట్ అనడంపై.. కేసు కోర్టు పరిధిలో ఉన్నదని, ప్రజలు గెలిపించి ప్రతిపక్ష నేతగా జగన్‌ను ఎన్నుకున్నారని, అలాంటి వారికి అపాయింటుమెంట్ ఇవ్వడం ఏమిటని అడగడం ఏమిడని కూడా అంటున్నారు. లోకేష్ అవినీతిపై ఆధారాలు అని చెబుతున్నప్పుడు పవన్ వెనుక బీజేపీ ఉందనేందుకు ఏమి ఆధారాలు ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు.

దానిని దృష్టి మరల్చే ప్రయత్నమా?

దానిని దృష్టి మరల్చే ప్రయత్నమా?

ఏపీలో పెద్దస్థాయిలో అవినీతి జరుగుతోందని దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు హోదా అంశాన్ని మరోసారి ఎత్తుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో భారీ అవినీతి జరుగుతోందని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గట్టిగా నిలదీయనంత వరకు పవన్‌పై సంయమనం పాటించారని, ఇప్పుడు నిలదీసేసరికి వెనుక బీజేపీ ఉంటుందని టీడీపీ ఆరోపిస్తోందని, మరి ఇంతకాలం వైసీపీ ఆరోపించినట్లుగా అతని వెనుక టీడీపీ ఉన్నది కూడా నిజమేనా.. దీనికి సమాధానం చెప్పాలని అంటున్నారు.

తీవ్ర ఒత్తిడిలో చంద్రబాబు, అందుకే భావోద్వేగం

తీవ్ర ఒత్తిడిలో చంద్రబాబు, అందుకే భావోద్వేగం

చంద్రబాబు ఇటీవల భావోద్వేగానికి గురవుతున్నారని, దానిని చూస్తుంటే ఆయన ఎంత రాజకీయ ఒత్తిడిలో ఉన్నారో తెలిసిపోతోందని బీజేపీ నేత జీవీఎల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలవలేమనే ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారని విమర్శించారు. రాజకీయంగా బలహీనపడటంతో వచ్చే ఎన్నికల కోసం డ్రామాలు అన్నారు.

English summary
AP CM Chandrababu Naidu has decided to divorce the NDA over his demand for special status for Andhra Pradesh, disquiet within the party had started last year itself. At the time, he asked his party to fulfil mitra dharma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X