వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిప్యూటీ సీఎం కొట్టు కు జనసేన సెగ : మంగళగిరిలో గెలిచేది లోకేశ్ - రాసిపెట్టుకోండి..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ - జనసేన మధ్య రాజకీయ వైరం తారా స్థాయికి చేరింది. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు కార్తీక వనసమారాధనల్లోనూ నిరసన తప్పలేదు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో జరిగిన కాపు వనసమారాధనలో పాల్గొన్నారు. కొట్టును నిర్వాహకులు వేదిక మీదకు ఆహ్వానించారు. ఆ సమయంలో జనసేన అభిమానులు జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొట్టు ప్రసంగం కొనసాగుతున్నంత సేపు ఈ నినాదాలు చేస్తూనే ఉన్నారు.

డిప్యూటీ సీఎం కొట్టును అడ్డుకున్న జనసైనికులు
కొట్టు తన ప్రసంగం ముగించేందుకు సిద్దమయ్యారు. కాపులంతా ఐక్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం కొట్టు సూచించారు. ఇలా గోల చేయడం వల్ల జనసైనికులకు ఒరిగేదేమి ఉండదన్నారు. ఇలాంటి చర్యలతో కాపులను ఇతర కులాల్లో చులకనగా చూస్తున్నారంటూ సముదాయించే ప్రయత్నం చేసారు. ఈ విధానం సరి కాదని డిప్యూటీ సీఎం సూచించారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ మంత్రులు వర్సస్ పవన్ కల్యాణ్ అన్నట్లుగా సాగిన మాటల యుద్దంలో భాగంగా పవన్ ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇద్దరి సామాజిక వర్గం ఒకటేనని..పవన్ తనకు సోదరుడు అవుతారని చెప్పుకొచ్చారు. దీనికి పవన్ తీవ్రంగా స్పందించారు. ఒకటే సామాజికవర్గం పేరుతో నాతో బంధాలు కలుపుకొనే చనువు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కొట్టు పెట్టుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.

Janansena Protest against DY CM Kottu Satyanarayana, TDP confident on Lokesh winning in Mangalagiri

లోకేశ్ మంగళగిరిలో గెలుస్తారంటూ
ఇక, పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన పద్మశాలి వనభోజనాల్లో మరో పరిణామం చోటు చేసుకుంది. అక్కడ మంగళగిరి మాజీ టీడీపీ నేత..ప్రస్తుత వైసీపీ నాయకుడు, చేనేత విభాగ రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి ప్రసంగం సమయంలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. టీడీపీ బీసీలకు అన్యాయం చేసిందని..మంగళగిరిలో లోకేశ్ గెలవరంటూ గంజి చిరంజీవి వ్యాఖ్యానించారు. దీనికి స్థానిక బీసీ నేత ముశ్యం శ్రీనివారావు వేదిక ఎక్కి చిరంజీవి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన 34శాతం బీసీల రిజర్వేషన్‌ ఇచ్చాకే ఎందరో నాయకులయ్యారు. రాసిపెట్టుకోండి... అక్కడ గెలిచేది లోకేశ్‌ మాత్రమే నంటూ సవాల్ చేసారు. మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఎవరు పోటీ చేసినా లోకేశ్ దే గెలుపు అని చెప్పుకొచ్చారు.

కార్తీక వనసమారాధానల్లో పొలిటికల్ హీట్
ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆప్కో చైర్మన్‌ చల్లపల్లి మోహనరావైనా, గంజి చిరంజీవైనా ఈస్థాయికి వచ్చారంటే ఎన్టీఆర్‌ తెచ్చిన రిజర్వేషన్‌ పుణ్యమేనని వివరించారు. దీనికి సంబంధించిన వీడీయో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి గతంలో పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసారు. 2019 ఎన్నికల్లో లోకేశ్ వెంట నిలిచారు. కొద్ది నెలల క్రితం టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలుపు కోసం లోకేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా సాగుతున్న వనసమారాధనలో నూ ఏపీ రాజకీయాలు వేడి పెంచుతున్నాయి.

English summary
Janasena workers protest against Dy CM kottu Satyanarayana in Tadepalligudem, TDP Supporters confident on Lokesh winning in Mangalagiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X