ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..టీడీపీ కీలక నేత అరెస్ట్
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1) అరెస్ట్ సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడైన జనార్ధన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న జనార్ధన్‌రావు.. ఈరోజు సౌతాఫ్రికా నుంచి నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఆయన ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే రంగంలోకి దిగి, అతడిని అరెస్ట్ చేశారు.

నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న జనార్ధన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో, ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ కేసు వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను, ఇతర నిందితులను గుర్తించేందుకు జనార్ధన్‌రావును పోలీసులు ప్రశ్నించనున్నారు.
నకిలీ మద్యం సరఫరా, అమ్మకాల కేసుల్లో ప్రధాన నిందితుడిని విదేశాల నుంచి రాగానే అరెస్ట్ చేయడం ఈ కేసు దర్యాప్తులో ముఖ్య పరిణామంగా చెప్పవచ్చు. ఈ కేసులో జనార్ధన్‌రావు పేరు బయటకు రాగానే టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ నకిలీ మద్యం కేసులో ఎవరి పాత్ర ఉన్న విడిచిపెట్టేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications