టి అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి: మండలికి నేతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ శాసనసభ్యుడు జానారెడ్డి ప్రమాణం చేశారు. సోమవారం రాజ్‌భవన్‌లో జానారెడ్డితో ప్రొటెం స్పీకర్‌గా తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ ప్రమాణం స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. సోమవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ప్రమాణం చేయిస్తారు.

Janareddy elected as Protem Speaker

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా నేతి విద్యాసాగర్ రావుచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆయన మండలి ఛైర్మన్‌గా కొనసాగే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున శాసనమండలి సభ్యులచే మరోసారి నేతి విద్యాసాగర్ రావు ప్రమాణం చేయించనున్నారు.

కాగా, సుమారు 12ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో సోమవారం అడుగుపెట్టనున్నారు. మంగళవారం నాటి శాసనసభ సమావేశాల్లో అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+