జనసేనకు మద్దతు ప్రచారంలో జబర్ధస్త్ టీం- హైపర్ ఆదికి అక్కడ బాధ్యతలు..!!

స్థానిక ఎన్నికల వేళ ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో హోరా హోరీ రాజకీయం చోటు చేసుకుంటోంది. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జెడ్పీ స్థానాల పైన కూటమి పార్టీల్లో కసరత్తు కొనసాగుతోంది. నవంబర్ 1న జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. జనసేన అభ్యర్ధులకు మద్దతుగా జబర్ధస్త్ టీం నటులు ప్రచారం ప్రారంభించారు. ప్రతీ ఇంటికి వెళ్లి మద్దతు కూడగడుతున్నారు.

స్థానిక ఎన్నికల వేళ జగన్ వ్యూహాల వెనుక - ఆ ఒక్క నిర్ణయంతో సీన్ ఛేంజ్..!!
స్థానిక ఎన్నికల వేళ జగన్ వ్యూహాల వెనుక - ఆ ఒక్క నిర్ణయంతో సీన్ ఛేంజ్..!!

స్థానిక ఎన్నికల్లో మరోసారి జబర్ధస్త్ నటుల సందడి మొదలైంది. మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నిక ల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్ధులకు మద్దతుగా జబర్ధస్త్ నటులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలోనూ జనసేన అభ్యర్ధులకు మద్దతుగా జబర్ధస్త్ నటులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. జబర్ధస్త్ టీంలో ఎక్కువ మంది పవన్ కు మద్దతు గా నిలుస్తున్నారు.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీదే హవా: సీప్యాక్ ఒపీనియన్ పోల్ క్లియర్
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీదే హవా: సీప్యాక్ ఒపీనియన్ పోల్ క్లియర్
Janasena Candidates Get Support from Jabardasth Team Actors in Local Body Poll Campaign

హీరో తనిష్క్ తో సహా.. హైపర్ ఆది తన టీంతో కలిసి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్ధుల కోసం ప్రచారంలోకి దిగారు. అనకాపల్లి లో కూటమి అభ్యర్ధులకు మద్దతుగా జబర్దస్త్ కమెడియన్లు రాజు, అప్పారావు, దొరబాబు సహా పలువురు నటీ నటులు పాల్గొన్నారు. 112వ వార్డు కూటమి (జనసేన) అభ్యర్థిని ఆళ్ల వైష్ణవి తరఫున వీరు ఇంటింటి ప్రచారం చేపట్టారు. జనసేన అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

కాగా.. మెగా ఫ్యామిలీ పైన ప్రతీ సందర్భంలో తన అభిమానం చాటుకునే జబర్ధస్త్ ఫేం ఇప్పుడు కూడా ప్రచారంలోకి దిగారు. పిఠాపురంలో 2024 ఎన్నికల సమయంలో ఆది పవన్ కు మద్దతు గా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు హీరో తనిష్క్ తో కలిసి అనకాపల్లి పరిధిలో కూటమి అభ్యర్థుల తరఫున రోడ్ షోలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలోని సామర్లకోటలోనూ జనసేన అభ్యర్థుల కోసం కు మద్దతుగా జబర్దస్త్ టీం ప్రచార బరిలో నిలిచి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ప్రచారం సమయంలో గత రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ కళాకారులు ప్రజలకు వివరిస్తూ, గాజుగ్లాసు గుర్తుకు మరియు కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతున్నారు. దీంతో.. వీరు ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+