Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వ్యూహం మార్చిన పవన్, జగన్‌ను కలుస్తాననే ప్రకటన వెనుక...

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యూహన్ని మార్చుకొంటున్నాడు. 2019 ఎన్నికల్లో పోటీ కోసం ఆయన సన్నాహలు చేసుకొంటున్నాడు.

అమరావతి:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యూహన్ని మార్చుకొంటున్నాడు. 2019 ఎన్నికల్లో పోటీ కోసం ఆయన సన్నాహలు చేసుకొంటున్నాడు. అయితే అదే తరుణంలో ప్రజల సమ్యల పరిష్కారం కోసం తాను ఎవరినైనా కలిసేందుకు సిద్దమేనని ప్రకటించారు. ఉధ్ధానం సమస్య పరిష్కారం కోసం జగన్‌తో కలవడానికి కూడ సిద్దమని ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. వైసీపీ చీఫ్ జగన్ అధికార టిడిపిపై దూకుడును మరింత పెంచాడు. ఈ ఏడాది అక్టోబర్‌ నుండి పాదయాత్రకు జగన్ సన్నాహలు చేసుకొంటున్నాడు.

అయితే పాదయాత్రలో టిడిపి వైఫల్యాలను వివరించేందుకు ఆ పార్టీ రంగం సిద్దం చేసుకొంటుంది.అయితే 2019 ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తోందని పవన్‌కళ్యాణ్ ఇదివరకే ప్రకటించారు.

అయితే ఇతర పార్టీల కంటే తమ పార్టీలో పనిచేసేవారంతా భిన్నంగా ఉండాలని పవన్‌కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు కార్యకర్తల ఎంపిక ప్రక్రియను కూడ కొనసాగిస్తున్నారు. అయితే ఇదే సమయంలో పవన్ తన పార్టీ వ్యూహన్ని మార్చుకొంటున్నాడు.

మారుతున్న పవన్ వ్యూహం

మారుతున్న పవన్ వ్యూహం

ఏపీలో గతంలో చోటుచేసుకొన్న పరిణామాలపై పవన్ వ్యవహరించిన తీరు, ఆదివారంనాడు విశాఖలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై హర్వర్డ్ వైద్యులతో సమావేశం సందర్భంగా వ్యవహరించిన తీరులో మార్చు కొట్టొచ్చినట్టుగా కన్పించింది. ప్రత్యేక హోదా విషయమై, రైతుల నుండి భూ సేకరణ విషయమై నేరుగా ఆందోళనలకు పవన్ దిగాడు అయితే ఉద్దానం సమస్యపై అన్ని పార్టీలతో కలిసేందుకు సిద్దమేనని ప్రకటించాడు. ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే జగన్‌ను కూడ కలిసేందుకు తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. అయితే పవన్ పార్టీలో వ్యూహత్మక మార్పులు చోటుచేసుకొంటున్నట్టు కన్పిస్తున్నాయి.

ఆచితూచి అడుగులు

ఆచితూచి అడుగులు

గతంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాలకులపై విమర్శలు గుప్పించిన పవన్ విశాఖలో నిర్వహించిన సదస్సులో మాత్రం కొంత భిన్నంగా కన్పించారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం కావాలనే దిశగా మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను చూడాలని కోరారు. ఈ సమస్య పరిష్కారాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని ఆయన విన్నవించారు. అంతేకాదు ఈ విషయమై తాను ఏం చేయమన్నా చేస్తాననే సంకేతాలు ఇచ్చారు.

జగన్ కలుస్తాననే ప్రకటన వెనుక

జగన్ కలుస్తాననే ప్రకటన వెనుక

వైసీపీ చీఫ్ జగన్‌ను కలిసేందుకు కూడ సిద్దమేననే ప్రకటన కూడ వ్యూహత్మకమేనా అనే చర్చ కూడ లేకపోలేదు. అధికార టిడిపి చెప్పినట్టుగానే పవన్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు పవన్ పార్టీపై ఉన్నాయి. ఈ విషయమై గతంలో కొన్ని పార్టీలు ఆరోపణలు చేశాయి. అయితే విశాఖ వేదికగా సాగిన ఈ సభలో సమస్య పరిష్కారం కోసం జగన్‌ను కలిసేందుకు కూడ సిద్దమేనని ప్రకటించడంతో టిడిపికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇప్పటికిప్పుడే ఓ అంచనాకు రావడం కూడ సరైంది కాదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

2019 ఎన్నికలకు ఇలా

2019 ఎన్నికలకు ఇలా

2019 ఎన్నికల కోసం జనసేన సన్నద్దమౌతోంది. అయితే క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించుకొంటూ ఆ పార్టీ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొనే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇందులో భాగంగానే టిడిపి, వైసీపీలకు ధీటుగా ఎదగాలంటే దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రభావం రానున్న ఎన్నికల్లో పార్టీపై కొంత సానుకూలంగా కన్పించే అవకాశాలు ఉంటాయనే భావన కూడ లేకపోలేదు. ఈ దిశగానే ఆ పార్టీ అడుగులు వేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+