పిఠాపురంలో వర్మ నివాసం కేంద్రంగా ఆట మొదలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. జనసేనాని పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపరంలో అడుగు పెడుతున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు అక్కడే ప్రచారం చేయనున్నారు. వారాహి నుంచి తొలి విడత ఎన్నికల ప్రచారం జనసేన నేతలు ఖరారు చేసారు. ఇదే సమయంలో అటు వైసీపీ అలర్ట్ అయింది. పిఠాపురంలో వర్మ పాత్ర కీలకంగా మారనుంది. కొత్త లెక్కలు మొదలైన వేళ పిఠాపురం రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
పిఠాపురంలో పవన్
జనసేనాని పవన్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. వారాహి విజయభేరి యాత్ర పేరిట పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12. 30 గంటలకు పవన్ హెలికాఫ్టర్‌లో రానున్నారు. మధ్యాహ్నం 1గంటకు పిఠాపురం పురుహుతికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడే వారాహి వాహనానికి పూజలు నిర్వహించనున్నారు. 1.30కు దత్త పీఠాన్ని దర్శించుకోన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దొంతమూరులో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ తో భేటీ కానున్నారు. అక్కడి నుంచి పిఠాపురంలో తన బసకు పయనం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు, రామాలయం సెంటర్‌లో వారాహి విజయభేరీ బహిరంగసభ నిర్వహించనున్నారు.

వర్మ నివాసానికి జనసేనాని
పిఠాపురంలో పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించిన తరువాత టీడీపీ నేత వర్మ మద్దతు దారులు నిరసనకు దిగారు. వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని నినదించారు. తరువాత చంద్రబాబు నేరుగా వర్మతో మాట్లాడటంతో పవన్ కు మద్దతిచ్చేందుకు సిద్దమయ్యారు. పవన్ గెలుపుకు సహకరిస్తానని ప్రకటించారు. అటు వైసీపీ పిఠాపురం నుంచి వంగా గీతకు మద్దతుగా జనసేన నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది. కీలక నేతలకు అక్కడ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పిఠాపురం పరిధిలోని పలువురితో మంత్రాంగం ప్రారంభించారు. వైసీపీ గెలుపుకు తాను పని చేస్తానని ముద్రగడ ప్రకటించారు. ఈ సమయంలో పిఠాపురంలో పవన్ ప్రచారం ప్రారంభం కానుంది.

ప్రచార షెడ్యూల్ ఖరారు
పవన్ తన తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అభ్యర్దులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల పై ఫోకస్ చేసారు. తొలి విడత ప్రచార షెడ్యూల్ ను పార్టీ నేత మనోహర్ ప్రకటించారు. పవన్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పీ గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సైతం ప్రచార బరిలోకి దిగటంతో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారనుంది.












Click it and Unblock the Notifications