పోటీ, పొత్తులపై సర్వీ రిపోర్టులు రెఢీ - పవన్ మంత్రాంగం, ఏం తేల్చాయి..!?

జనసేనాని పవన్ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. పొత్తుల పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన పవన్..ఇప్పుడు సొంత పార్టీలో కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ముందుగా పొత్తులు.. సీట్ల పైన సర్వే నివేదికలు సిద్దం చేసుకున్నారు. పార్టీ బలం..ఓట్ల శాతం పైన ఇప్పటికే పవన్ స్పష్టతకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లొ పొత్తుల్లో ఎన్ని సీట్లు తీసుకోవాలి.. ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్దులు నిలబెట్టాలి.. ఎవరికి సీట్లు ఖరారు చేయాలనే అంశాల ప్రాతిపదికన ఈ సర్వే నివేదికలు పవన్ కు అందాయని సమాచారం.

సర్వేలపై పవన్ ఫోకస్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటువంటి హంగామా లేకుండా ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ ను ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రారంభించారు. కేవలం కొందరు ముఖ్య నేతలకు మాత్రమే సమాచారం ఉంది. ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ విజయవాడ చేరుకున్నారు.

 pawankalyan4

ఈ సారి పూర్తిగా పవన్ పార్టీని ఎన్నికల్లో సయాయత్తం చేసేందుకు కావాల్సిన అంశాల పైనే ఎక్కువగా ఫోకస్ చేసారు. అందులో భాగంగా ముందుగా పార్టీ క్షేత్ర స్థాయిలో బలం పైన చేయించిన సర్వే నివేదికలపైన చర్చలు చేసారు. రేస్‌ సర్వే సంస్థ ద్వారా ఏపీలో ఏ జిల్లాల్లో ఎవరికి బలం ఏ మేర ఉంది...పార్టికి అనుకూల - ప్రతికూల అంశాల పైన నివేదికలు సమీక్షించారు.

జిల్లాల వారీగా నివేదికలతో : బీజేపీ అంశం తేలకపోయినా, టీడీపీతో పొత్తు ఖాయం. టీడీపీకి ప్రతిపాదించి..చర్చల ద్వారా సీట్లు దక్కించుకోవాలంటే ముందుకు తమ బలం ఏంటనేది తేల్చుకొనే పనిలో పవన్ నిమగ్నయ్యారు. గోదావరి జిల్లాల్లో బలం పెరిగిందని.. సీమలో తక్కువగా ఉందంటూ నివేదికలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఉత్తరాంధ్రలోనూ పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన సూచనలు వచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశం పైన సర్వే నివేదికల్లో ఒక స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. పవన్ గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లా నుంచి రెండు సీట్లలో పోటీ చేసారు. ఈ సారి తూర్ప గోదావరితో పాటుగా సీమ లేదా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

 pawankalyan4

పవన్ పోటీ ఎక్కడనుంచి : ఇప్పుడు టీడీపీతో పొత్తు వేళ పవన్ ఎన్ని సీట్లు ప్రతిపాదిస్తారు..ఎన్ని దక్కించుకుంటారు అనేది కీలకంగా మారుతోంది. వైసీపీతో ఎన్నికల యుద్దంలో ప్రతిపక్షాలకు ప్రతీ సీటు కీలకం కానుంది. దీంతో, తమ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను పవన్ పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర..సీమలో తక్కువ సీట్లు, గోదావరి జిలాల్లో ఎక్కువ సీట్లలో బలంగా ఉందని సర్వే తేల్చినట్లు తెలుస్తోంది.

ఈ నివేదికల ఆధారంగా పవన్ టీడీపీ ముందు తమ డిమాండ్ ఉంచనున్నారు. గతంలో 20 సీట్లకు ఒప్పందం కుదిరినట్లుగా జరిగిన ప్రచారాన్ని పవన్ ఖండించారు. దీంతో..ఇప్పుడు పూర్తిగా సర్వే నివేదికలతో సిద్దమైన పవన్..సీట్ల గురించి..అదే విధంగా తన పోటీ గురించి కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+