మైండ్ గేమ్ కు లొంగేది లేదు - పొత్తులపై పవన్ కల్యాణ్ క్లారిటీ..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు వేళ అనేక రకాల చర్చలు తెర మీదకు వస్తున్నాయి. దీని పైన పార్టీ ఆవిర్భావ సభలోనూ పవన్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో 20
సీట్లకు అంగీకారం కుదిరినట్లుగా వచ్చిన వార్తలను ఖండించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు కట్టుబడి ఉన్నానని.. పొత్తుల విషయంలో వ్యూహాల నిర్ణయం తనకు వదిలేయాలని పవన్ కల్యాణ్ కోరారు. ఇప్పుడు పార్టీ నేతలకు పవన్ కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా మైండ్ గేమ్ కు లొంగేది లేదని..పొత్తులపై పారదర్శకంగా ఉంటామని జనసేనాని సష్టం చేసారు.

పొత్తుల విషయంలో అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని..ఎవరూ ఆందోళనకు గురి కావద్దని జనసేనాని పవన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు పార్టీలోకి కొందరు ముఖ్య నేతలతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం. వైసీపీ మైండ్‌గేమ్‌లో కార్య‌క‌ర్త‌లు, పార్టీ నాయ‌కులు ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు. పొత్తులపైన ఎటువంటి వ్యూహం అమలు చేసినా.. పార్టీలో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఎన్నిక‌ల వ్యూహాలు, ఎత్తుల విష‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, ప్రభుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను ఎట్టిప‌రిస్థితుల్లో కూడా చీల‌నివ్వ‌బోమ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన‌ట్లు నాదెండ్ల మ‌నోహ‌ర్ పేర్కొన్నారు. నిర్ణ‌యాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా ప్ర‌క‌టిస్తార‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు.

Janasena Chief Pawan Kalyan gave Clarity on Alliance in next elections, says dont believe in YCP mind game

పొత్తులు..ప్రకటనల పేర్లతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పైన పార్టీ నేతలను అప్రమత్తం చేసారు. పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలను పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ పవన్ ప్రకటన చేసిన సమయం నుంచి వైసీపీ మైండ్ గేమ్ ఆడోతోందని మనోహర్ చెప్పుకొచ్చారు. పొత్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీలో పారదర్శకంగానే వెల్లడిస్తామని స్పష్టం చేసారు. ఇక, అటు టీడీపీ వరుసగా గెలిచిన మూడు పట్టభద్రులు..ఎమ్మెల్సీ సీటుతో జోష్ లో ఉంది. పొత్తుల విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో రైతుల కష్టాలపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+