ప్రత్యేక ఆకర్షణ: గవర్నర్ పిలుపుతో ఎట్‌హోంకు పవన్!
హైదరాబాద్: దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చే అల్ఫాహార విందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
ఈ మేరకు విందుకు హాజరు కావాలని గవర్నర్ ప్రత్యేకంగా పవన్‌ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగే తేనీటి విందులో పవన్ పాల్గొననున్నారు. కాగా, తొలిసారిగా పవన్‌కు గవర్నర్ నుంచి ఆహ్వానం అందడం గమనార్హం.

దీంతో ఎట్‌హోంగా పిలిచే ఈ అల్పాహార విందు కార్యక్రమంలో పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, స్పీకర్లు, కౌన్సిల్ ఛైర్మన్లు హాజరుకానున్నారు. వీరితో పాటు ఈసారి కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో అవార్డులు అందుకున్న అధికారులు, నగరంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications