ఒక్క నిర్ణయం.. ఎన్ని సంవత్సరాలు వెనక్కి??

నాయకుడు అనేవాడు మంచి మార్గంలో తాను నడవడంతోపాటు తన వెనక వచ్చేవారిని కూడా నడిపించాలి. అందుకు పట్టుదల, ఓర్పు, సహనం కీలకమైన లక్షణాలు. మంచి మార్పు కోసం, మంచి రాజకీయాలు చేయడానికే వచ్చానంటున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 25 సంవత్సరాలైనా నిలబడతానన్నారు. అంత సమయం తనకు వేచిచూసే ఓర్పు ఉందన్నారు. కానీ రాష్ట్రంలో ఐదురోజులుగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే పవన్ ఓర్పు వహించలేకపోయారని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.

10 సంవత్సరాలు వెనక్కి నెట్టిన నిర్ణయం?

10 సంవత్సరాలు వెనక్కి నెట్టిన నిర్ణయం?

పవన్ కల్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం రాజకీయాల్లో పది సంవత్సరాలు వెనక్కి నెట్టిందని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా కనపడటంలేదని జనసేన శ్రేణులు, అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. హోటల్ గదిలోనుంచి బయటకు రానివ్వలేదనే కారణంతో మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. మంగళగిరి రాకుండా
విశాఖపట్నంలో పోలీసులు నోటీసులిచ్చినప్పటికీ అక్కడే ఉండివుంటే రాజకీయ పరిణామాలు వేరుగా వుండేవంటున్నారు.

పొత్తుల వల్ల ఒంటరిగా ఎదగడం కష్టం?

పొత్తుల వల్ల ఒంటరిగా ఎదగడం కష్టం?

నోటీసులివ్వడంవల్ల మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావడం, యుద్ధం ప్రారంభమైందని, రేపటినుంచి రాజకీయాల్లో మార్పు ఉంటుందని ప్రకటించిన కొద్దిసేపటికే చంద్రబాబుతో భేటీ అవడంవల్ల తన ఎదుగుదలకన్నా జగన్ ను దించేయాలనేదే ప్రధానమైన లక్ష్యంగా కనపడిందంటున్నారు. ఒకరకంగా జనసేనాని టీడీపీతో పొత్తుకు సిద్ధపడినట్లేనని, పొత్తుండటంవల్ల ఒంటరిగా ఎదగడం సాధ్యం కాదంటున్నారు. విశాఖ వేడిలోనే ఒంటరిగా రాష్ట్రంలో రాజకీయం చేస్తే కచ్చితంగా కింగ్ మేకర్ గా నిలవడానికి అవసరమైనన్ని సీట్లు గెలుచుకునే పరిస్థితి లభ్యమయ్యేదంటున్నారు.

రాజకీయ పరిణతి రాలేదు?

రాజకీయ పరిణతి రాలేదు?

పవన్ కు ఇంకా రాజకీయ పరిణతి రాలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చంద్రబాబునాయుడి తర్వాత తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న తరుణంలో పవన్ ఒక్క ఐదు సంవత్సరాలు ఓర్పు వహించివుంటే బాగుండేదంటున్నారు. జనంలో నమ్మకం కలగాలంటే ఎంతో ఓర్పు ఉండాలని, పక్కనే చంద్రబాబుకు ఎంత ఓర్పు ఉందో పవన్ అర్థం చేసుకోవాలంటున్నారు. ఎదుటివారిని ఓడించాలన్న ఆలోచనకన్నా మనం ఎలా గెలవాలి అనే తీరులో ఆలోచన చేస్తే అది అందలం ఎక్కించేదని, కానీ జగన్ ను దించేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడంవల్ల, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధపడటంవల్ల ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లారో అర్థం కావడంలేదని కొందరు జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+