ప్రభుత్వం జీవో, జైలుకు వెళ్లేందుకు సిద్దం - ఏపీలో ఏన్డీఏ ప్రభుత్వం : పవన్..!!
ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తన పైన ఏపీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ కు జీవో ఇచ్చిందని తాను సిద్దమని ప్రకటించారు. దెబ్బలు తినటానికైనా...జైలుకు వెళ్లటానికి అయినా సిద్దమని స్పష్టం చేసారు. ఎన్డీఏలో జనసేన బలమైన ముద్ర ఉంటుందని చెప్పారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రజల డేటా హైదరాబాద్ లోని ఒక కేంద్రంలో ఎందుకు ఉంచాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
అన్నింటికీ సిద్దం : రాష్ట్రం కోసం తాను జైలుకు వెళ్లటానికి..దెబ్బలు తినేందుకు సిద్దంగా ఉన్నానని పవన్ చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో వైసీపీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరారు. రమేష్ బాబుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల పైన తాను మాట్లాడినందుకు తనను ప్రాసిక్యూట్ చేయమని ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెప్పారు.

తనను అరెస్ట్ చేసుకోవాలని సవాల్ చేసారు. తాను ప్రాసిక్యూషన్ కు సిద్దమని ప్రకటించారు. వాలంటీర్లకు రోజు వేతనం రూపాయాలు ఇస్తున్నారని..వాలంటీర్ల తరపు తాను నిలబడతానని స్పష్టం చేసరు. వాలంటీర్లతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం : ఇది డేటా చౌర్యంగా పవన్ పేర్కొన్నారు. డేటా చౌర్యం పైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని పవన్ చెప్పారు.. ఎఫ్ఓఏ కంపెనీలో డేటా ఉంచారని..ఆ సంస్థ ఎవరిదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించేది ఈ జీవోనే అని పవన్ హెచ్చరించారు. హైదరాబాద్ లో అయినా..మంగళగిరిలో ఎక్కడికి వచ్చి అయినా తనను విచారించుకోవచ్చని చెప్పారు.
తనకు బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని పవన్ వివరించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అమిత్ షాతో తాను చెప్పదలచుకున్నది చెప్పానని..నిర్ణయం జరిగిపోయిందని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

జగన్ తో సై అంటే సై : ప్రధాని మోదీతో తనకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని..అది రాష్ట్ర ప్రయోజనాలతో ముడి పడి ఉందని పవన్ వివరించారు. తన పార్టీ నేతల పైన దాడి చేసిన సీఐ పైన ఎస్పీకి ఫిర్యాదు చేసామని... వాలంటీర్ల పైన ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. వాలంటీర్లకు అధిపతి జగన్ అని దుయ్యబట్టారు.
జగన్ సై అంటూ తాను సై అంటానని పవన్ చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు రమేష్ బాబు తీసుకోవాలని పవన్ సూచించారు. ప్రభుత్వం పవన్ ప్రాసిక్యూషన్ కు జీవో ..పవన్ సిద్దమని ప్రకటించటంతో ఇప్పుడు రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications