జనసేన లో పవన్ మార్క్ ప్రక్షాళన, కీలక నిర్ణయాలు..!!
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. తన నియోజకవర్గం పిఠాపురం నుంచే మార్పులు మొదలు పెట్టారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరు పైన నివేదికలు తెప్పించుకు న్నారు. కొందరి పైన వస్తున్న ఫిర్యాదులతో వారికి తన మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. పార్టీ కమిటీల కూర్పు పైన పవన్ కసరత్తు చేస్తున్నారు. కీలక మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గా ల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల ని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పార్టీ కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులకు దిశా నిర్దేశం చేశారు. పిఠాపురం సహా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితుల పైన పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. తన నియోజకవర్గం నుంచే ప్రక్షాళన ప్రారంభించారు. పిఠా పురంలో పార్టీ వ్యవస్థను సరిదిద్దేందుకు ఆయన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

పార్టీ ప్రక్షాళనలో భాగంగా గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్‌గా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాస్ ను రెండు నెలల క్రితం ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఆ తరువాత, పార్టీ పనులను చూసుకో వడానికి ఐదుగురు సభ్యులతో కూడిన 'ఫైవ్ మెన్ కమిటీ'ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల బాబు సహా మర్రెడ్డి సభ్యులుగా ఉన్నారు. కాగా.. ఇటీవల కాలంలో మర్రెడ్డిపై పార్టీ కార్యకర్తల నుండి అనేక ఫిర్యాదులు రావడం, ఆయన పనితీరు పార్టీ కార్యక్రమాలకు అడ్డంకిగా మారుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ మరో కీలకమైన చర్య తీసుకున్నారు. మర్రెడ్డి స్థానంలో, పార్టీ కార్యక లాపాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్న ఓదూరి కిశోర్‌ను కొత్త సభ్యుడిగా నియమించారు.
ఓదూరి కిశోర్ చేబ్రోలు ప్రాంతంలో జనసేన పార్టీ సమావేశాలకు, కార్యకర్తల వసతికి సహాయం అందిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా.. పార్టీ కొందరు ముఖ్యుల బాధ్యతల్లో నూ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. కీలక నేతలతో సమావేశమైన పవన్.. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలమైన నేతలు ఉన్నారని పార్టీ హై కమాండ్ భావిస్తోంది. అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.












Click it and Unblock the Notifications