అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అశ్వథ్దామ హత:' కేసీఆర్ 'రాజనీతి' అర్థమైందా పవన్?

|
Google Oneindia TeluguNews

పవన్ కల్యాణ్ తన రాజకీయ పార్టీ జనసేనను స్థాపించి 10 సంవత్సరాల సుదీర్ఘకాలం పూర్తయింది. అయితే తనకున్న కమిట్ మెంట్స్ వల్ల సినిమాలను, రాజకీయాలను రెండు పడవలమీద ప్రయాణం చేయాల్సి వస్తోంది. సినిమాల్లో నటించడంద్వారా వచ్చిన సొమ్మునే రాజకీయ పార్టీ నడపడానికి ఉపయోగిస్తారు. అందుకు తప్పనిసరిగా సినిమాల్లో నటించాలి.

2029కి సొంతంగా బలపడాలని..

2029కి సొంతంగా బలపడాలని..

పూర్తి స్థాయి రాజకీయ పార్టీని నడుపుతూ నేతగా అవతరించాలంటే ఆర్థికంగా బలోపేతం కావడం ముఖ్యం. పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. విరాళాలు తక్కువగా వస్తాయి. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకోవడానికి సొంత నిధులే వాడుతున్నారు. వైసీపీని దించి తెలుగుదేశం పార్టీ సహకారంతో కొన్ని ఎమ్మెల్యేలు సీట్లు సాధించాలనేది పవన్ యోచన. తర్వాత సభలో తనతోపాటు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను చూపించి 2029కి సొంతంగా బలపడదామనేది పవన్ దీర్ఘకాలిక ప్రణాలిక. అవసరమైతే బీజేపీతో పొత్తును కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు.

పవన్ ఆశలపై కేసీఆర్ నీళ్లు

పవన్ ఆశలపై కేసీఆర్ నీళ్లు

ఇటువంటి తరుణంలో ఏపీలో బీఆర్ఎస్ అడుగులు పవన్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. మొదటి నుంచి తెలంగాణలో కేసీఆర్ పాలనపై పొగడ్తల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. అటువంటి పవన్ కు కేసీఆర్ జలక్ ఇచ్చారు. ఇప్పటివరకు సొంత సామాజికవర్గం బలంగా ఉంటుందనే నమ్మకంతో భవిష్యత్తు కోసం ధీమాగా అడుగులు వేస్తున్న పవన్ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం షాకిచ్చింది. కేసీఆర్ రాజకీయం అర్థంకాలేదు కాబట్టి పవన్ కు షాక్ తగిలినట్లుగా ఉందని, అర్థమైతే అలా ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్థకం

రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్థకం

ద్రోణాచార్యుడు యుద్ధం విరమించాలంటే యుధిష్టరుడు అబద్దం చెప్పాల్సి వచ్చింది. అయితే ద్రోణాచార్యుడి కొడుకు అశ్వథ్దామ హతుడయ్యాడని ఎందరు చెప్పినా ద్రోణాచార్యుడు నమ్మకుండా యుద్ధం చేస్తూనే ఉంటాడు. కానీ ధర్మరాజును అడుగుతాడు నిజం చెప్పమని. అప్పుడు ఆయన అశ్వథ్ధామ హత: అనే వాక్యాన్ని పెద్దగా చెప్పి, కుంజర: అనే వాక్యాన్ని చిన్నగా చెబుతున్నారు. ఎన్నడూ అబద్ధం చెప్పని ధర్మరాజు కాబట్టి ద్రోణులు యుద్ధం విరమిస్తాడు. ప్రత్యర్థులు అతన్ని హతమారుస్తారు. ధర్మరాజు ధర్మం తప్పకుండా కుంజర: అనే వాక్యాన్ని చిన్నదిగా చెబుతాడు. అశ్వత్ధామ చనిపోయిందికానీ అది ఏనుగు అనే అర్థం రావాలి. ఏనుగు అనే పదాన్ని చిన్నగా చెబుతాడు. కేసీఆర్ ఏపీలో చేస్తున్న రాజకీయం కూడా ఇలాగే ఉంది. ఈ విషయం వపన్ కల్యాణ్ కు అర్థమైందా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్థకంగా మారింది.

English summary
It has been a long 10 years since Pawan Kalyan founded his political party Jana Sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X