జనసైనికుల కోసం పవన్ వ్యూహాత్మక అడుగులు, యూత్, మేధావులే టార్గెట్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేరే వారి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇతర పార్టీలకు జనసేనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు చూపాలనే ఉద్దేశ్యంతోనే ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

జనసేన పార్టీలో చేరేవారి కోసం ధరఖాస్తులను ఆహ్వనించింది ఆ పార్టీ.అయితే ఈ ధరఖాస్తులు చేసుకొన్నవారిని ఫిల్టర్ చేసి పార్టీలో సభ్యత్వాన్ని ఇవ్వనున్నారు. అయితే ఎలాంటి మచ్చలేనివారికే పార్టీలో సభ్యత్వం కల్పించేందుకుగాను పా్రటీ ప్రయత్నాలను చేస్తోంది.

మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీలో చేరేందుకుగాను అభ్యర్థులు భారీగా ధరఖాస్దులు చేస్తున్నారు.అయితే ఈ ధరఖాస్తులను స్కృూట్నీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.వచ్చే ఎన్నికల్లో జనసేన చీఫ్ అనంతపురం జిల్లా నుండి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.ఈ మేరకు ఆయన సన్నాహాలు చేసుకొంటున్నారు.

Janasena chief Pawan kalyan will selection for party workers from the 19 May

రాజకీయాల్లో ప్రతిభావంతులైన యువత, మేధావులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతోనే పవన్ ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండి జనసేన పార్టీలో చేరేందుకుగాను ఇప్పటికే సుమారు 6 వేల మంది ధరఖాస్దు చేసుకొన్నారు. మరో వైపు గ్రేటర్ హైద్రాబాద్ నుండి సుమారు 4,500 మంది ధరఖాస్దు చేశారు.

ఈ నెల 17, 18 తేదిల్లో శ్రీకాకుళం జిల్లాలో, ఈ నెల 19,20 తేదిల్లో విశాఖలో,ఈ నెల 23 నుండి 26 వరకు గ్రేటర్ పరిధిలో పార్టీలో చేరేవారిని గుర్తించే ప్రక్రియను కొనసాగించనుంది జనసేన పార్టీ.నైతికవిలువలు, స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఇతర పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీకి చెందిన క్యాడర్ తేడా ఉండాలనే ఉద్దేశ్యంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు వపన్ కళ్యాణ్.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena chief Pawan kalyan will selection for party workers from the 19 May.He planning youth and intelligents joining party.
Please Wait while comments are loading...