నేను రోడ్డెక్కక తప్పదు - ఎవరి తరం కాదు : పవన్ కళ్యాణ్..!!
జనసేన ఉనికి లేకుండా చేయాలనుకోవటం ఎవరి తరం కాదని.. ప్రజలే పార్టీని కాపాడుకుంటారని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. విజయవాడ పశ్చిమ..జగ్గయ్య పేటలలో పార్టీ జెండా ఆవిష్కరణ ను వైసీపీ వర్గాలు అడ్డుకున్న తీరు చూస్తుంటే ఆ పార్టీలో ఓటమి పైన భయం స్పష్టం అవుతుందని పవన్ వ్యాఖ్యానించారు. పోతిన మహేష్ ను అరెస్ట్ చేయటాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. జగ్గయ్యపేటలో జనసేన పతాకావిష్కరణ కోసం నిర్మించుకున్న దిమ్మెను వైసీపీ శ్రేణులు కూల్చివేసారని...వారి పైన చర్యలు తీసుకోకుండా జనసేన కార్యకర్తలను ప్రశ్నించటాన్ని తప్పు బట్టారు.
ఇది న్యాయబద్దమా అనేది పోలీసులే అలోచించాని సూచించారు. జనసేన శ్రేణులు తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవటం అధికార పార్టీకి వత్తాసు పలకటంగా భావిస్తున్నామన్నారు. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా అని పవన్ ప్రశ్నించారు. అన్నింటికి అనుమతులు ఉన్నాయని పోలీసులు ప్రకటించగలరా అంటూ నిలదీసారు. అనుమతులు లేకపోతే వాటిని తొలిగిస్తారా అంటూ పవన్ ధ్వజమెత్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే సదుద్దేశంతోనే నిన్న..మొన్న ఇంత జరుగుతున్నా, తాను రోడ్డు మీదకు రాలేదన్నారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తాను రోడ్డు పైకి రాక తప్పదని హెచ్చరించారు.

అరెస్ట్ అయిన..అక్రమ కేసులు ఎదుర్కొంటున్న జనసేన నేతలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పవన్ కోరారు. ప్రభుత్వం లోని పెద్దలు..శాసనసభ్యులు ఈ రోజు ఉంటారు, రేపు పదవి ఊడితే ఇంటికి పోతారంటూ వ్యాఖ్యానించారు. కానీ పోలీసు అధికారులు సర్వీసు ఉన్నంత కాలం ప్రజలతోనే గడుపుతారని పేర్కొన్నారు. మరో పార్టీ ప్రభుత్వం వస్తే పోలీసు అధికారులు తల దించుకొనే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు పవన్ వివరించారు. ధర్మాన్ని పాటించాలంటూ పవన్ పోలీసులను కోరారు.












Click it and Unblock the Notifications