• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి బడ్జెట్ పై జనసేన నిప్పులు.!ప్రచార ఆర్భాటం తప్ప ప్రయోజనం శూన్యమన్న మనోహర్.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా, ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని విధంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. డాంబికాలు, ప్రచార ఆర్భాటాలకు బడ్జెట్ ను ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని పదే పదే గొప్పలు చెప్పుకున్న వైసిపి నాయకులు, ఏ వర్గానికి కూడా న్యాయం చేసింది లేదని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు

 గత ఏడాది కేటాయింపులతో ఎవరికి న్యాయం జరిగింది? బడ్జెట్ పై లోతైన చర్చ జరగాలన్న జనసేన

గత ఏడాది కేటాయింపులతో ఎవరికి న్యాయం జరిగింది? బడ్జెట్ పై లోతైన చర్చ జరగాలన్న జనసేన

ప్రభుత్వ తీరుతో క్షేత్ర స్థాయిలో సామాన్యుడు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికే జనసేన పార్టీ రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయినింగ్ చేసిందన్నారు మనోహర్. గత ఆర్ధిక సంవత్సరం రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం కోసం బడ్జెట్ లో 7500 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. దానిని సవరించి 5 వేల కోట్లకు తగ్గించారని గుర్తు చేసారు మనోహర్. చివరికి మరమ్మతుల కోసం ఎంత విడుదల చేశారో ఎవరికీ తెలియదని, రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా గోతులు పడ్డ రోడ్లే దర్శనమిస్తున్నాయని మండి పడ్డారు.

 రోడ్ల పరిస్థితి దారుణం.. ప్రణాళిక లేని ప్రభుత్వమన్న మనోహర్

రోడ్ల పరిస్థితి దారుణం.. ప్రణాళిక లేని ప్రభుత్వమన్న మనోహర్

జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయినింగ్ తో ఉలిక్కిపడ్డ ముఖ్యమంత్రి హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి 2 వేల కోట్లు రోడ్ల మరమ్మతుల కోసం విడుదల చేస్తున్నామని ప్రకటించారన్నారు. రోడ్ల మరమ్మతులను నెల రోజుల్లో పూర్తి చేస్తామని గత ఏడాది నవంబర్ లో చెప్పారని, తరువాత తుపాన్లు వచ్చాయని, వర్షాలు పడుతున్నాయని పనులు నెలల తరబడి వాయిదా వేసుకుంటూ వెళ్లారన్నారు. గత ఏడాది 2 వేల కోట్లే ఖర్చు చేయని వైసీపి ప్రభుత్వం ఇప్పుడు 8500 కోట్లు ఖర్చు చేస్తామని చెబితే ఎవరు నమ్ముతారని నాదెండ్ల మనోహర్ సూటిగా ప్రశ్నించారు.

 సాయం పొందే మత్స్యకారుల్లో ఇంత కోతా? సీఎం జగన్ చిత్తశుద్ది లేదన్న మనోహర్

సాయం పొందే మత్స్యకారుల్లో ఇంత కోతా? సీఎం జగన్ చిత్తశుద్ది లేదన్న మనోహర్

97 వేల మంది మత్స్యకారులకు రూ. 10 వేల చొప్పున ఇస్తున్నామని ఆర్ధిక మంత్రి గొప్పగా చెప్పుకున్నారని, సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారులు దాదాపు 2 లక్షల 30 వేల మంది ఉంటే కేవలం 97 వేల మందికి కేవలం 10 వేలు చొప్పున ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులు, వారి స్థితిగతులు చూస్తే వాళ్లు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు మీకు అర్ధమవుతాయని సీఎం జగన్ కు నేరుగా సూచించారు మనోహర్. పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమతో కలిపి మత్స్యకార శాఖకు రూ. 1568 కోట్లు మాత్రమే కేటాయించారని, గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే కేవలం 10 శాతం మాత్రమే పెంచారని, ఈ బడ్జెట్ కేటాయింపులు ఏ కోణం నుంచి చూసినా నిరుపయోగమేనని అసంతృప్తిని వ్యక్తం చేసారు.

 ఏ ప్రాతిపదికన తెలంగాణతో పోల్చుకోగలం.. సూటిగా ప్రశ్నించిన జనసేన

ఏ ప్రాతిపదికన తెలంగాణతో పోల్చుకోగలం.. సూటిగా ప్రశ్నించిన జనసేన

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారని, ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ లక్షా 61 వేల కోట్లు ఉండగా మొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ. 2 లక్షల 56 వేల కోట్లుగా ఉందన్నారు. ఈ రోజు ఏపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కూడా రూ. 2 లక్షల 56 వేల కోట్లు. ఏ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంతో మనం పోల్చుకోగలుగుతామని ప్రశ్నించారు. జనాభా, విస్తీర్ణం పరంగా ఏపి రాష్ట్రం పెద్దదని, రాష్ట్రానికున్న సహజ వనరులు ఆ రాష్ట్రానికి లేవని, ఇన్ని అంశాల్లో ఇంత తేడా ఉంటే వాళ్ల బడ్జెట్, మన బడ్జెట్ మాత్రం ఒక్కటేనని, దీనిపై ప్రజల్లో లోతుగా చర్చజరగాలనన్నారు మనోహర్.

 పెట్టుబడులు ఎలా వస్తాయి.. తమిళనాడులో పెట్టుబుడులు ఉన్నాయా.?

పెట్టుబడులు ఎలా వస్తాయి.. తమిళనాడులో పెట్టుబుడులు ఉన్నాయా.?

పరిశ్రమల శాఖకు బడ్జెట్ కేటాయించడం, రెండు, మూడు నెలలలో సవరించడం, ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు గత ఏడాది రూ. 1133 కోట్లు కేటాయించారని, చివరకు సవరించి రూ. 331 కోట్లకు తీసుకొచ్చారన్నారు. అదేవిధంగా పరిశ్రమల శాఖకు గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 2540 కోట్లు కేటాయించారని, ఏపి ప్రాంతానికి అద్భుతంగా పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి దొరుకుంతుందని చెప్పారని, చివరకు ఆ బడ్జెట్ కేటాయింపులను సవరించి రూ. 1906 కోట్లకు కుదించారని ఎద్దేవా చేసారు. బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా తమిళ కవి గురించి మాట్లాడారంటే ముఖ్యమంత్రికి, ఆయన సహచర మంత్రులకు అక్కడ పెట్టుబడులు ఉన్నాయని అర్ధమవుతోందన్నారు నాదెండ్ల మనోహర్.

English summary
Nadendla Manohar, chairman of the Janasena party's political affairs committee, was outraged that the budget introduced by the Andhra Pradesh government was far from being real and in no way useful to the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X