పవన్‌కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
టికెట్ల పంచాయితీ కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది.మూడు పార్టీలో పార్టీల్లో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది.ముఖ్యంగా జనసేన పార్టీలో అసమ్మతి కాస్తా ఎక్కువగా కనిపిస్తోంది. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు సైతం టికెట్ దక్కడం లేదు. పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ టికెట్ దక్కకపోవడంతో కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్డం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదంటూ తన బాధను బయటపెట్టారు. ఇప్పటికే పరుచూరి భాస్కరరావు జనసేన నుంచి బయటకు వచ్చేశారు.

తాజాగా మరో కీలక నేత జనసేన పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం అందుతోంది. జనసేన కీలక నేతల్లో పితాని బాలకృష్ణ కూడా ఒకరు. ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో మామ్మిడివరం నియోజకవర్గం నుంచి జనసేన తరుఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మామ్మిడివరం టికెట్ పితానికే అంటూ గతంలో పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
దీంతో నియోజకవర్గంలో విసృతంగా ప్రచారం నిర్వహించిన ఆయనకు ఎన్నికల ముందు గట్టి షాక్ తగిలింది. పొత్తులో భాగంగా మామ్మిడివరం టికెట్ టీడీపీకి దక్కింది. ఆ పార్టీకి చెందిన దాట్ల బుచ్చిబాబును అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో పితానికి నిరాశ ఎదురైంది. పవన్ కల్యాణ్ తనని మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారని.. కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని పితాని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ఆయన జనసేనను వీడాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులుగా జనసేనపై అసంతృప్తితో ఉన్న పితాని వైసీపీలో చేరడానికి సిద్ధమైయ్యారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో గురువారం పితాని భేటీ అయ్యారు. ఆయన ఈ నెల 30న జగన్ సమక్షంలో వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఆయనతో పాటు భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications