ఇన్నాళ్లు నేతలు, పార్టీలకు జై కొట్టాం.. ఇక నుంచి - పవన్..!!

జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. యువజన విభాగం ప్రారంభించింది. ఈ విభాగానికి 'జై కొట్టు' అనే పేరును ఖరారు చేశారు. పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 'జై కొట్టు' లోగోను నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆడియో సందేశం ఇచ్చారు. ఇన్నాళ్లు పార్టీలు.. నేతలకు జిందాబాద్ కొట్టామని ఇక నుంచి యువత భవిత, మార్పు, తీర్పు కోసం జై కొట్టాలని పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ తమ అధికారిక యువజన విభాగాన్ని ప్రారంభించింది. ఈ యువజన విభాగానికి 'జై కొట్టు' అనే శక్తివంతమైన పేరును ఖరారు చేసింది. పిఠాపురంలో ఘనంగా ఆవిష్కరించారు. పార్టీ నాదెండ్ల మనోహర్ ఈ లోగోను విడుదల చేయగా, పెద్ద ఎత్తున జనసైనికులు, యువత హాజరయ్యారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంపిన ప్రత్యేక ఆడియో మెసేజ్ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన సందేశంలో యువతకు దిశా నిర్దేశం చేస్తూ, బాధ్యతాయుతమైన రాజకీయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. 'జై కొట్టు' అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని, అది యువత ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆయన కొనియాడారు. దేని కోసి చేతులు చాచవద్దని.. దేశం కోసం పని చేసే చేతులు కావాలని పిలుపునిచ్చారు.

పవన్ జన్మదిన వేళ ప్రధాని మోదీ ప్రత్యేకంగా - చంద్రబాబు, లోకేష్ సహా..దేవుడిచ్చిన అన్న..!!
పవన్ జన్మదిన వేళ ప్రధాని మోదీ ప్రత్యేకంగా - చంద్రబాబు, లోకేష్ సహా..దేవుడిచ్చిన అన్న..!!
janasna-launches-party-youth-wing-with-name-jai-kottu-pawan-kalyan-interesting-message-to-youth-de

యువతకు పవన్ సందేశం


రాష్ట్ర నిర్మాణంలో యువత భాగస్వామ్యం ఎంతైనా ఉందని, వారి భావాలను, సమస్యలను వేదికపైకి తీసుకురావడానికే ఈ వేదికను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమాజంలో మార్పు తీసుకురావడానికి యువశక్తి ఎంతో కీలకమని మనోహర్ పేర్కొన్నారు. జనసేన సిద్ధాంతాలను ప్రజా క్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లడంలో 'జై కొట్టు' విభాగం చురుగ్గా వ్యవహరిస్తుందని, యువతలోని నాయకత్వ పటిమను బయటకు తీయడమే దీని ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గా ల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+