మన ప్రభుత్వంలోనూ ఇంతేనా? పవన్ కు జనసేన నేత బొలిశెట్టి ఫిర్యాదు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు అక్రమాలపై విపక్ష జనసేన పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేసింది. జనసేనకు చెందిన యాక్టివిస్టులు బొలిశెట్టి సత్యనారాయణ, పీతల మూర్తి యాదవ్ వంటి వారు ఎన్నో అక్రమాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు హైకోర్టుకు వెళ్లి పోరాటాలు చేశారు. ఇప్పుడు వారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా అవే సమస్యలు కొనసాగుతున్నాయి. దీనిపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను అక్రమంగా తవ్వేస్తుండటంపై బొలిశెట్టి సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. భౌగౌళిక వారసత్వం కలిగిన ఈ అరుదైన ఎర్రమట్టి తిన్నెల్ని అక్రమార్కులు జేసీబీలతో తవ్వేస్తుండటంపై ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత , డిప్యూటీ సీఎం, పర్యావరణ మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్ కు బొలిశెట్టి ఫిర్యాదు చేశారు.

ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు, అది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం. ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి విశాఖ భీమిలి మధ్య రెండవది తమిళనాడులోని పేరి వద్ద. అటువంటి ప్రపంచ భౌగోళిక… pic.twitter.com/7qUPCe3ewW
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) July 16, 2024
ఈ ఎర్రమట్టి తిన్నెలు కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని, అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగమని బొలిశెట్టి తన ట్వీట్ లో తెలిపారు. ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయని, ఒకటి విశాఖ భీమిలి మధ్య, రెండవది తమిళనాడులోని పేరి వద్ద అన్నారు. అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుండి ఎదేచ్చగా దాడి జరుగుతుంది అని తనకు సమాచారం వచ్చిందన్నారు. అధికారులు తక్షణమే స్పందించాలి.. దీనిని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ కు కూడా తెలియచేస్తున్నట్లు ఆయన పోస్టులో పెట్టారు.












Click it and Unblock the Notifications