Prudhvi Raj Survey: ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు- పృధ్వీ రాజ్ తాజా సర్వే..!
ఏపీలో త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై పలు ప్రముఖ సర్వే సంస్ధలు తమ రిపోర్టులు ప్రకటిస్తున్నాయి. అలాగే పలు జాతీయ వార్తా ఛానల్ నెట్ వర్క్ లు సైతం తమ సర్వేలను వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీలో జనసేన నేత, టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కూడా తన అంచనాల్ని ఈ మధ్య వెల్లడిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇవాళ కూడా మరో సర్వే ఫలితాలను 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ బయటపెట్టాడు.

గతంలో వైసీపీలో పనిచేసిన పృధ్వీరాజ్.. ఆ తర్వాత గుడ్ బై చెప్పేశారు. తాజాగా జనసేనలో చేరిన ఆయన.. టీడీపీ-జనసేన కూటమి తరఫున జనంలో తిరుగుతున్నారు. ఇందులో భాగంగా పృధ్వీరాజ్ ఇవాళ వచ్చే ఎన్నికలపై శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకూ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 136 అసెంబ్లీ సీట్లు గెలవబోతోందని పృధ్వీరాజ్ తెలిపాడు. అలాగే వైసీపీకి మిగిలిన కేవలం 39 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశాడు.
మరోవైపు పార్లమెంట్ సీట్లపైనా పృధ్వీరాజ్ తన లెక్క వెల్లడించాడు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ సీట్లలో టీడీపీ-జనసేన కూటమి ఏకంగా 21 సీట్లు దక్కించుకోబోతోందని పృధ్వీరాజ్ తెలిపాడు. మిగిలిన నాలుగు సీట్లలో వైసీపీ గెలుస్తుందన్నాడు. అలాగే వచ్చే ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ మంత్రి ఆర్కే రోజాదే అన్నాడు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోజా అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా జనసేన వెంట ఉందని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. అలాగే టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే సంబరాల రాంబాబు (అంబటి రాంబాబు) సేవల్ని వాడుకుంటామన్నాడు. టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీకి సహకరిస్తున్న అధికారులపై రాస్తున్న రెడ్ డైరీ తరహాలోనే తాను కూడా ఎమ్మెల్యేల అక్రమాలపై బ్రౌన్ డైరీ రాస్తున్నట్లు పృధ్వీరాజ్ వెల్లడించాడు.












Click it and Unblock the Notifications