గెలిచేది మనమే-కౌంటింగ్ రోజు కూల్ - జనసైనికులకు నాగబాబు కీలక సూచన..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నాయి. దీంతో పాటు కౌంటింగ్ రోజు చోటు చేసుకుంటాయని భావిస్తున్న పరిణామాలపైనా నేతలు, క్యాడర్ ను పార్టీలు అప్రమత్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో కౌంటింగ్ రోజు జనసైనికులు ఎలా ఉండాలన్న దానిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఇవాళ రిలీజ్ చేసిన వీడియోలో నాగబాబు.. జనసైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, పిఠాపురం జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విజయానికి చేరువలో ఉందని నాగబాబు తెలిపారు.వైసీపీ పరాజయం అంచుల్లో ఉందన్నారు. ఎప్పుడైతే ఓ మనిషైనా ఓడిపోతాడని తెలిస్తే ఫ్రస్ట్రేషన్ ఉంటుందని,హింసకు, గొడవలకు సిద్ధమవుతుంటారని నాగబాబు తెలిపారు.

రాబోయే కూటమి గెలుపుని ఓర్వలేక,ఓటమి భారాన్ని తట్టుకోలేక ఓట్ల లెక్కింపు రోజున వైసిపి చేసే ఏ దాడినైన సంయవనంతో జయించండి అధికారులకి సహకరించండి...#jaijanasena #JaiHind @JanaSenaParty@JSPShatagniTeam pic.twitter.com/D9Y9bxNxwk
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 30, 2024
ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి పోలీసులు, ఈసీకి సహకరిద్దామని నాగబాబు పార్టీ శ్రేణులు, నేతలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పదించొద్దని వారిని కోరారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని గుర్తుచేశారు. అంతా సైలెంట్ గానే ఉందాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏమీ చేయొద్దన్నారు. పోలీసులు, ఈసీకి సహకరిద్దాం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెడదామంటూ నాగబాబు పిలుపునిచ్చారు. రాబోయేది కూటమి ప్రభుత్వమే, ఓడిపోయే వాళ్లు చేసే కవ్వింపు చర్యలకు, అల్లర్లకు ప్రతిస్పందించవద్దన్నారు.












Click it and Unblock the Notifications