పేర్నినానికి జనసైనికుల అల్టిమేటం - ధర్నా, ఉద్రిక్తత..!!

మాజీ మంత్రి పేర్ని నాని పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. నానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. పవన్ పైన తాజాగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేసారు. నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఒక దశలో దాడికి ప్రయత్నం జరగ్గా..పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడలో చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఒక్క సారిగా రాజకీయంగా ఉద్రిక్తత ఏర్పడింది. పవన్ కు అనుకూలంగా జనసైనికులు నినాదాలు చేసారు.

గుడివాడలో వైసీపీ నేత శివాజీ ఇంటికి మాజీ మంత్రి పేర్ని నాని వచ్చారు. నాని అక్కడకు వచ్చిన విషయం తెలుసుకున్న జనసైనికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పార్టీ జెండాలతో అక్కడే బైఠాయించారు. పవన్ కల్యాణ్, జనసేనకు అనుకూలంగా నినాదాలు చేసారు. డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. తాజాగా మీడియా సమావేశంలో పేర్ని నాని ఉప ముఖ్యమంత్రి పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన అభ్యంతరం వ్యక్తం చేసారు.

Janasena leader protest against Perni Nani Trension prevailed in Guidvada

జనసైనికుల ఆందోళన చేస్తున్నా పేర్ని నాని వారితో మాట్లాడలేదు. జనసైనికుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పేర్ని నాని పైన దాడికి ప్రయత్నం జరిగిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో, పోలీసులు అక్కడ ధర్నా చేస్తున్న వారిని పంపించే ప్రయత్నం చేసారు. పేర్ని నాని క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జనసైనికులు స్పష్టం చేసారు. దీంతో, ఒక్క సారిగా ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+