కోట్లు కొళ్లగొట్టిన చిన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..

టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో ట్రెండ్ మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు పెద్ద హిట్టు అవుతున్నాయి. వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయి ప్లాఫ్ అవుతున్నాయి. గతేడాది చిన్నసినిమాలు లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, శంభాల బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన కోలీవుడ్ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'బ్లాస్ట్' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చిన ఈ మూవీ స్ట్రాంగ్ కంటెంట్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. మే 28 న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది.

బ్లాస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.70 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌ టైనర్ ను సుభాష్ కే రాజ్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మార్షల్ ఆర్ట్స్ మూవీ ఎప్పుడెప్పుడూ ఓటీటీలో రిలీజ్ అవుతుందా..? అని మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ నెట్‌ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్‌ ను అధికారికంగా ప్రకటించింది. బ్లాస్ట్ మూవీ జూన్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది.

బ్లాస్ట్ మూవీకి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. బ్లాస్ట్ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. సినిమా మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు మలిచారు. ఈ మూవీలో అర్జున్ ఓ కరాటే మాస్టర్ పాత్రలో నటించారు. రాజారామ్ అనే పాత్రలో ఒదిగిపోయారు అర్జున్.

ArjunSarja Action Blockbuster Blast Set For Its Digital Premiere Streams on Netflix From June 25

కథ విషయానికి వస్తే.. రాజారామ్(అర్జున్), నీలవేణి(అభిరామి) భార్యాభర్తలు. వారికి నీలా(ప్రీతి ముకుందన్‌) కూతురు ఉంటుది. రాజారామ్, నీలవేణి ఇద్దరూ కరాటే మాస్టర్లు. దాంతో తమ కూతురు నీలాను కూడా కరాటే మాస్టర్ గా చేస్తారు. ఈ కుటుంబం మొత్తం పిల్లలకు ఉచితంగా కరాటేలో శిక్షణ ఇస్తూనే మరోవైపు మెడికల్ షాప్ ను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఓ రోజు నీలా షాపులో ఉండగా కృపాకర్(పవన్) గ్యాంగ్ కు చెందిన ఓ రౌడీ మెడికల్ షాపు నుంచి బలవంతంగా మందులు తీసుకెళ్తుండగా నీలా కృపాకర్ ను చితకబాది పోలీసులకు అప్పగిస్తుంది. అయితే కృపాకర్ గ్యాంగ్ తో పాటు అండర్‌వరల్డ్ డాగ్‌ అబ్రహం(అర్జున్‌ చిదంబరం) కూడా ఆ కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? అనేదే సినిమా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+