నారా లోకేష్ పాదయాత్రలో జనసేన
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పాదం కలిపారు. జనసేన, యువగళం జెండాలతో పాదయాత్రకు జనసేన నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసైనికులకు లోకేష్ అభివాదం చేశారు.
తాను ఎస్సీలను అవమానించినట్లు ఒక మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఎస్సీలను అవమానించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు. నిరూపించలేకపోతే భారతీరెడ్డి తన పత్రిక, ఛానెల్ మూసేస్తారా? అని సవాల్ విసిరారు. తాను ఎస్సీలను అవమానించినట్లు చూపిన వీడియోలో చప్పట్లు కొడుతున్నారని, తాను అవమానిస్తే వారు చప్పట్లు కొడతారా? ఇంత చిన్న లాజిక్ ను భారతీరెడ్డి ఎలా మిస్ అయ్యారని లోకేష్ ప్రశ్నించారు.

హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య భేటీ గంటకు పైగా సాగింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీని కూడా కలుపుకుపోవాలనే యోచనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారు. వీరిద్దరి మధ్య భవిష్యత్తులో మరిన్ని భేటీలుంటాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ విముక్త ఏపీ కోసం తమ పార్టీ పనిచేస్తోందని, విశాఖపట్నంలో భూదందాలపై జనసేన పోరాటం చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications