పవన్ కు గోల్డెన్ ఛాన్స్ మిస్ - రాజీ ఫలితం, మళ్లీ దక్కాలంటే..!!

జనసేనాని గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు. పెద్దల సభలో తమ పార్టీ ప్రాతినిధ్యం దక్కే అవకాశం తప్పిపోయింది. పెద్దన్నయ్య తరహాలో చిన్నన్నయ్యను రాజ్యసభకు పంపాలనే కోరిక ఇప్పటికైతే నెరవేరలేదు. కూటమిలోని రెండు పెద్ద పార్టీల కోసం రాజీ పడాల్సి వచ్చింది. అయితే, అప్పుడు లోక్ సభ సీటు.. ఇప్పుడు రాజ్యసభ సీటు రెండు సందర్భాల్లోనూ పవన్ రాజీ పడ్డారు. నాగబాబు కు అవకాశం దక్కలేదు. పవన్ మాత్రమే రాజీ పడాలా అనే చర్చ జనసైనికుల్లో మొదలైంది.

కూటమి సభ్యులుగా
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు కూటమి ఏకగ్రీవంగా గెలుచుకోనుంది. మూడు పార్టీల కూటమికి మూడు స్థానాలను పంచు కోవాలని తొలుత భావించారు. ఈ మూడు స్థానాలు వైసీపీ ఎంపీలు ఖాళీ చేయటంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. రాజీనామా చేసిన ముగ్గురూ బీసీ నేతలే. ఆర్ క్రిష్ణయ్యను బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. తన అభ్యర్దిత్వం ప్రకటించిన తరువాతనే ఆర్ క్రిష్ణయ్య ఆన్ లైన్ లో బీజేపీ సభ్యత్వం తీసుకొని.. ఈ రోజు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసారు.

Janasena missed the chance for entry in Rajyasabha Regular Vacancies again in 2026

అనూహ్య నిర్ణయాలు
ఇక, బీదా మస్తాన రావుకు టీడీపీలో చేరితే రాజ్యసభ తిరిగి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా మస్తాన రావు సైతం ఈ రోజు నామినేషన్ వేసారు. మూడో అభ్యర్దిగా జనసేన నుంచి నాగబాబు పేరు చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అనకాపల్లి ఎంపీగా పోటీకి సిద్దపడి చివరి నిమిషం లో బీజేపీ కోసం పవన్ ఆ సీటు వదులు కోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే నాగబాబుకు రాజ్యసభ హామీ దక్కింది. కానీ, ఇప్పుడు నాగబాబుకు రాజ్యసభ దక్కలేదు. ఈ సీటును టీడీపీ రెండో అభ్యర్దిగా సానా సతీశ్ కు కేటాయించారు. దీంతో, నాగబాబుకు రావాల్సిన సీటు సానా సతీశ్ కు దక్కింది.

మళ్లీ ఛాన్స్ ఎప్పుడు
ఫలితంగా బుజ్జగింపుల్లో భాగంగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. అందునా రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించే సమయంలోనే ఈ విషయం వెల్లడించటం ద్వారా చివరి నిమిషం వరకు జనసేన నాగబాబుకు రాజ్యసభ ఖాయమనే ఆశతో ఉండటమే కారణమని తెలుస్తోంది. దీని ద్వారా పెద్దల సభలో అడుగు పెట్టే అవకాశం ప్రస్తుతానికి జనసేన కోల్పోయింది. తిరిగి అవకాశం దక్కాలి అంటే వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మిగిలిన ఎనిమిది మందిలో ఎవరైనా రాజీనామా చేయాలి. లేదా, 2026 లో వైసీపీ సభ్యులు ఆళ్ళ దశరధ రామిరెడ్డి, పరిమల్ నత్వాల్, ఈ రోజు కొత్తగా రాజ్యసభకు ఎంపికయ్యేందుకు నామినేషన్ వేసిన సానా సతీశ్ పదవీ కాలం ముగియ నుంది. దీంతో, రాజ్యసభలో జనసేనకు ఛాన్స్ గురించి ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+