పవన్‌కు షాక్..జనసేనకు మరో నేత గుడ్ బై..!
సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. జనసేనకు చెందిన కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ జనసేనకు రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ మనుక్రాంత్ గతంలోనే జనసేనకు రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆయన పవన్ కల్యాణ్ వ్యవహారశైలి నచ్చకనే జనసేన నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించారు.
తాజాగా ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.మనుక్రాంత్‌తో పాటు, జనసేన నేతలు కాటంరెడ్డి జగదీష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజర్ల సుబ్బారావు, కాంగ్రెస్ నేతలు పంతం నెహ్రూ, ఇందిర వైసీపీలో చేరారు. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు జనసేన నుంచి పెద్ద ఎత్తున నాయకులు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ 21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వారికి టికెట్లు కేటాయించడంపై జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పరుచూరి భాస్కరరావు,పితాని బాలకృష్ణ , పోతిన మహేష్, శెట్టిబత్తుల రాజబాబు, మాకినీడి శేషుకుమారి వంటి నాయకులు జనసేనకు రాజీనామా చేశారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications