కిరణ్ రాయల్ తో లక్ష్మీరెడ్డి రాజీ- ఫుల్ యూటర్న్-ఇరికించింది ఆయనే ?
తిరుపతికి చెందిన జనసేన నేత, పార్టీ ఇన్ ఛార్జ్ కూడా అయిన కిరణ్ రాయల్ పై రెండు నెలల క్రితం తీవ్ర ఆరోపణలు వచ్చాయి. లక్ష్మీ రెడ్డి అనే మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు బాధిత మహిళ మీడియా ముందుకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. కిరణ్ రాయల్ తన వద్ద డబ్బు తీసుకుని, తనను వాడుకుని వదిలేశారంటూ ఆరోపించారు. ఆ తర్వాత చెక్ బౌన్స్ కేసులో జైపూర్ కేసులు ఆమెను అరెస్టు చేసినా బెయిల్ పై బయటికి వచ్చి కిరణ రాయల్ తో లావాదేవీల ఆధారాలు బయటపెట్టారు. ఇవాళ అనూహ్యంగా లక్ష్మీరెడ్డి యూటర్న్ తీసుకున్నారు.
తిరుపతిలో హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టిన లక్ష్మీరెడ్డి.. కిరణ్ రాయల్ తో వివాదాన్ని రాజీ చేసుకున్నట్లు ప్రకటించారు. కిరణ్ రాయల్ తో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. తన కుటుంబ సమస్యల వల్లే బయటకు వచ్చాను, కానీ రాజకీయ పార్టీలు తనను వాడుకున్నాయని ఆరోపించారు. రెండు పార్టీల వాళ్ళు ట్రోల్స్ చేసుకున్నారన్నారు. తన సమస్యను వేరే వాళ్లు రాజకీయం కోసం వాడుకున్నారని, దీంతో తనకు సంబంధం లేదన్నారు.

ఒక్క వీడియో తప్ప మిగతావి తాను విడుదల చేయలేదని లక్ష్మీరెడ్డి తెలిపారు. కొన్ని పాత వీడియోలు బయటకు వచ్చాయని, జనసేన పార్టీ నేతలే డబ్బులు ఇప్పిస్తామని తన దగ్గర వీడియోలు తీసుకున్నారని ఆరోపించారు. వారి నుంచే ఇవి బయటకు వచ్చాయన్నారు. వీడియోల్లో ఏం మార్పులు చేసి బయటకు వదిలారో తనకు తెలియదన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు హస్తం ఇందులో ఉందన్నారు. వీటితో తనకు సంబంధం లేదన్నారు. పార్టీల పరంగా ఉన్న విబేధాల్లోకి తనను లాగారన్నారు.తనకు చాలా డ్యామేజ్ జరిగిందన్నారు.
కిరణ్ రాయల్ తో రాజీ అనేది తాము బయట తేల్చుకుంటామని, తన పిల్లలు కోరిక మేరకే ఈ వివాదం ఇక్కడితో ముగిస్తున్నానని లక్ష్మి తెలిపారు. దీనికి రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేదన్నారు. తనను ఎవరూ భయపెట్టలేదన్నారు. తన మాటలు ఇతరులను బాధ పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. ఇక ఇక్కటితో వీటిని ఆపేయాలని చూస్తున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications