పవన్ "పట్టు", లెక్క మారింది - చంద్రబాబుకు తాజా సంకేతాలు..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన(TDP Janasena) పొత్తుతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీ(BJP)తో పవన్(Pawan) దాదాపు దూరం అయినట్లే కనిపిస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తో టీడీపీలో అంతర్గతంగా అనిశ్చితి కొనసాగుతోంది. పవన్ తో పొత్తుపైన టీడీపీ తమకు ప్రయోజనం కలుగుతుందని భారీ ఆశలు పెట్టుకుంది. దీంతో పవన్ మరింత పట్టు బిగిస్తున్నారు. అసెంబ్లీతో తమ సభ్యుల సంఖ్య పెంచుకోవటానికి సరైన సమయంగా భావిస్తున్నారు.

మారుతున్న లెక్కలు:చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాల్లో పవన్ పాత్ర కీలకంగా మారుతోంది. టీడీపీ శ్రేణులు సైతం పవన్ నిర్ణయాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎన్నికల తరువాత అసెంబ్లీలో జనసేన(Janasena) ముద్ర స్పష్టంగా ఉంటుందని పవన్ పదే పదే చెబుతున్నారు. రాజకీయంగా బలోపేతం కావటం కోసమే బీజేపీ కంటే టీడీపీతోనే కలిసి వెళ్లటం ప్రయోజనరమనే నిర్ణయానికి వచ్చారు. టీడీపీతోనే కలిసి కొనసాగుతామని తేల్చారు.

Janasena planning to contest in 40 seats in next Elections, hints TDP with latest Decisions

ఇదే సమయంలో టీడీపీ నేతలు పవన్ తో సఖ్యత ప్రదర్శిస్తున్నారు. పవన్ వారాహి యాత్ర(Varahi Yatra)కు మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు బాలయ్య, లోకేశ్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్ట్ వరకు పవన్ తో ఒక లెక్క.. చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత ఇప్పుడు పవన్ తో మరో లెక్క అన్నట్లుగా పరిస్థితి మారుతోంది.

తాజా నిర్ణయాలతో:టీడీపీతో జనసేన పొత్తు ఖాయమని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. జనసేనకు పొత్తులో భాగంగా 15 -20 సీట్ల మధ్య కేటాయించాల్సి ఉంటుందని టీడీపీ అంచనా వేసింది. అయితే, సీట్ల గురించి తాను అసలు ఎప్పుడూ చర్చించలేదని గతంలోనే పవన్ స్పష్టం చేసారు. కానీ, ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. తాజాగా జనసేన తెలంగాణలో 32 సీట్లలో పోటీకి నిర్ణయించింది. స్థానాలను ప్రకటించింది. తెలంగాణలో పవన్ బలం నామమాత్రంగానే ఉంది. ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్నా..తెలంగాణలో ఇప్పటి వరకు ఒంటరి పోరుకే సిద్దమైంది. అక్కడ బీజేపీ తమకు ఎవరితో పొత్తులు ఉండవని తేల్చి చెప్పింది. టీడీపీతో జనసేన కలుస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ, ఈ నిర్ణయం ద్వారా పవన్ పరోక్షంగా టీడీపీ పైన ఒత్తిడి పెంచుతున్నారు.

Janasena planning to contest in 40 seats in next Elections, hints TDP with latest Decisions

పట్టు బిగిస్తున్న పవన్:తెలంగాణలో బలం పెద్దగా లేకపోయినా 32 సీట్లలో పోటీకి పవన్ సిద్దపడ్డారు. ఏపీలో ఈ సారి తమ పార్టీ బలం గతం కంటే భారీగా పెరిగిందని పవన్ పలు సందర్భాల్లో వివరించారు. దీని ద్వారా తెలంగాణ కంటే బలంతో పాటుగా అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉన్న ఏపీలో అంతుకు మించి స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి.

జనసేన గోదావరి జిల్లాల్లో గణనీయంగా ఓటింగ్ శాతం పెంచుకున్నట్లు పార్టీ నేతలు లెక్కలు చెబుతున్నారు. ఇదే విషయం టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. దీంతో, గతంలో భావించినట్లుగా 20 స్థానాలకు జనసేన అంగీకరించే అవకాశం లేదని.,. రెట్టింపు డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయినా, టీడీపీ నో చెప్పలేని పరిస్థితలో ఉందనే అభిప్రాయం ఉంది. దీంతో, సీట్లు..పవర్ షేరింగ్ పైన జనసేన నుంచి వచ్చే డిమాండ్ల పైన టీడీపీ ముఖ్య నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+