జులై 7న విశాఖ సాగర తీరంలో... జనసేన భారీ నిరసన పరేడ్
విశాఖపట్టణం: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన పార్టీ విశాఖలో భారీ నిరసన కార్యక్రమానికి సన్నద్దం అయింది. జులై 7న సాగర తీరాన జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కవాతు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం శనివారం విశాఖ సాగర తీరాన ఈ భారీ నిరసన పరేడ్ నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ ఆ సోషల్ మీడియా ప్రకటనలో పేర్కొంది. ఈ కవాతుకు వేలాదిగా తరలిరావాలని పార్టీ కార్యకర్తలకు, పవన్ అభిమానులకు పిలుపు నిచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కవాతులో పాల్గొని తమ నిరసన తెలియచేయాల్సింది జనసేన పార్టీ కోరింది.

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సముద్ర తీరాన ఈ కవాతు ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ వెల్లడించింది. కాళీమాత గుడి నుంచి ఈ కవాతు మొదలై వైఎంసీఏ వరకు కొనసాగుతుందని ఆ ప్రకటనలో వివరించారు.












Click it and Unblock the Notifications