జనసేన "మెగా- కాపు" వ్యూహాం - ఆ నలుగురితో జగన్ చెక్ : గెలుపెవరిది..!!
ఏపీలో గెలుపు - ఓటములను డిసైడ్ చేసే సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎన్నికల మంత్రాంగం ముందుకు సాగుతోంది. టీడీపీ - జనసేన మధ్య పొత్తు దిశగా రాజకీయ చర్చ జరుగుతున్న వేళ.. జనసేన నుంచి పక్కా వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. పార్టీలకు అతీతంగా కాపు రాజకీయ నేతలు జనసేనకు మద్దతుగా కదులుతున్నారు. ఇందుకు చాలా కాలంగా ఇతర పార్టీల్లో ఉన్న కాపు నేతలు సైతం ఏకం అవుతున్నారు. దీనిని గుర్తించిన జగన్ కౌంటర్ వ్యూహం అమలు చేస్తున్నారు. మరి..టీడీపీకి కలిసొచ్చే మెజార్టీ ఓటింగ్ ఉన్న వర్గం ఏది. చంద్రబాబు ముందున్న ప్రయత్నామ్నాయం ఏంటి.

కాపు నేతల ఐక్యత..జనసేను మద్దతుగా
ఏపీలో కాపు ఓటింగ్ దాదాపు 18 శాతంగా ఉంది. కాపులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇప్పుడు బలంగా వినిపిస్తున్న నినాదం. జనసేన ను ఓన చేసుకోవాలని కాపు నేతలు భావిస్తున్నారు. ఇందు కోసం ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు నేతలంతా ఒకటే నినాదంతో పని చేస్తున్నారు. ఇదే ఇప్పుడు జనసేనకు బలంగా మారుతోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో పని చేసిన నేతలు ఇప్పుడు జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. మెగా ఫ్యాన్స్ జనసేనకు అనుకూలంగా పని చేయాలని నిర్ణయించారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కీలక స్థానంలో ఉంటారంటూ ఆసక్తి పెంచుతున్నారు. కాపు వర్గం ప్రధానంగా ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో జనసేన ఈ సారి పక్కగా అనుకూల ఫలితాలు సాధిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇక, మెగా అభిమానులు వర్గాలు- ప్రాంతాలకు కు అతీతంగా అందరూ ఉండటం జనసేనకు కలిసి వచ్చే మరో అంశం. ఈ నెల 28న వంగవీటి రంగా వర్దంతి సందర్భంగా ఈ నెల 26న విశాఖలో కాపునాడు సభ ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించిన పోస్టర్లను చిరంజీవి ఆవిష్కరించాల్సి ఉందని స్వయంగా గంటా వెల్లడించారు. సభకు ఎవరెవరు హాజరు అవుతారనేది ఆసక్తి గా మారుతోంది. కలిసొచ్చే ఇతర సామాజిక వర్గాల పైన జనసేన ఫోకస్ పెడుతోంది.

జగన్ ముందస్తు చర్యలు - ఆ నలుగురితో
2019 ఎన్నికల్లో కాపు వర్గం ఓట్లు మెజార్టీ స్థాయిలో వైసీపీకి పోలయ్యాయి. పవన్ కల్యాణ్ తన అభిమానులు సైతం వైసీపీకి ఓటు వేసారంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ, ఈ సారి సమీకరణాలు మారుతున్నాయి. దీనిని సీఎం జగన్ ముందే అంచనా వేసారు. 2019 ఎన్నికల నుంచే 2024 ఎన్నికలకు సమాయత్తం అవటం మొదలు పెట్టారు. ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలతో అప్రమత్తం అయ్యారు. బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ ఓట్ బ్యాంకును ఓన్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తాను నమ్ముకున్నది ఆ నలుగురునేని చెబుతున్నారు. ఇప్పటికే జయహో బీసీ సభ నిర్వహించారు. ఇదే తరహాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. పేదల కోసం తాను.. పేదలంతా తన కోసం అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కాపు వర్గంలో ముఖ్యులుగా ఉన్న వారిని విశాఖ - గోదావరి జిల్లాల కేంద్రంగా ఆకర్షించే ప్రయత్నాలను వైసీపీ ప్రారంభించింది. కాపు వర్గంలో అంచనాలకు తగినట్లుగా వైసీపీకి మద్దతు దక్కకపోయినా.. ఇతర వర్గాల సపోర్ట్ తో అధికారానికి దగ్గర కావాలనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లోని కొందరు ఇతర పార్టీల్లోని కాపు నేతలు వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

టీడీపీ -జనసేన పొత్తుపై ఎఫెక్ట్
కాపు వర్గంలోని ప్రముఖులు పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అదే లక్ష్యంతో జనసేనకు మద్దతుగా కదులుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు సీఎం అవుతారని..అందుకు ఎంతమేర పార్టీలో మద్దతు లభిస్తుందనేది కీలక అంశం. ఇదే అంశాన్ని ఇప్పుడు వైసీపీ తమకు అనుకూలంగా మలచుకుంటోంది. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని పదే పదే జనసేనాని మద్దతు దారుల్లో నాటుకొనేలా చేస్తోంది. పొత్తు ఉంటే టీడీపీకి కలిసొచ్చే అంశాలు ఉన్నాయి. జనసేనకు ప్రభుత్వంలో వాటా దక్కుతుంది. అదే సమయంలో పొత్తు లేకపోతే..టీడీపీకి ప్రధాన ఓట్ బ్యాంకుగా నిలిచి మద్దతుగా ఎవరు ఉంటారనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఏ పార్టీ గెలవాలన్నా ఏ ఒక్క వర్గమో ఓటింగ్ తోనే సాధ్యం కాకపోయినా.. ప్రభావం చూపించటం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో, ఎన్నికల కసరత్తులో ఏ పార్టీకి ఏ వర్గం మద్దతుగా నిలుస్తోందని రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications